Begin typing your search above and press return to search.
బాహుబలిని టచ్ చేయడానికి 24డేస్
By: Tupaki Desk | 4 Feb 2019 11:42 AM GMTబాహుబలి సంచలనాల్ని బాలీవుడ్ అంత తేలిగ్గా మర్చిపోలేదు. ఇప్పటికీ ఈ సినిమా విజయం వెనక రహస్యం ఉత్తరాది క్రిటిక్స్ అంతు చిక్కడం లేదు. అలా చేద్దామంటే చేయలేక చతికిలబడిపోతున్నారు. దిగ్గజాలు అని చెప్పుకోదగ్గ ఖాన్ లకే ఇది అంతు చిక్కడం లేదు. అమీర్ ఖాన్ - షారూక్ ఖాన్ - సల్మాన్ ఖాన్ అంతటి వాళ్లే తడబడుతున్నారు. అమీర్ నటించిన దంగల్ ఇప్పటికీ దేశీయ కలెక్షన్లలో నంబర్ 2 గానే ఉంది. బాహుబలి స్వదేశంలో నంబర్ 1 చిత్రంగా ఇంకా రికార్డుల్లో ఉంది.
అయితే ఈ సినిమా రికార్డుల్ని టచ్ చేసే క్రమంలోనే థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ - జీరో వంటి చిత్రాలతో ఎటెంప్ట్ చేసినా పనవ్వలేదు. ఇకపోతే ఇటీవలే రిలీజై అనూహ్య విజయం సాధించిన యంగ్ హీరో విక్కీ కౌశల్ చిత్రం మాత్రం ఎవరూ ఊహించని రీతిలో అద్భుత వసూళ్లతో దూసుకుపోతోంది. తొలి నుంచి క్రిటిక్స్ ప్రశంసలతో ఈ సినిమాకి పెద్ద బూస్ట్ వచ్చింది. ఈ సీజన్ బెస్ట్ హిట్ అని చెప్పుకున్న ఈ చిత్రం సైతం హిందీ బాక్సాఫీస్ వద్ద బాహుబలి రికార్డును టచ్ చేయడానికి ఏకంగా 24 రోజులు వేచి చూడాల్సొచ్చింది. తాజా రిపోర్ట్ ప్రకారం 24 రోజుల్లో (నాలుగు వారాలు) బాహుబలి- హిందీ వెర్షన్ సృష్టించిన 190 కోట్ల వసూళ్ల రికార్డును ఈ సినిమా బ్రేక్ చేసింది. ఇప్పటికీ స్ట్రాంగ్ గానే బాక్సాఫీస్ కలెక్షన్లు దక్కుతున్నాయట.
ఇక ఊరి తర్వాత రిలీజైన కంగన మణికర్ణిక - సోనమ్ కపూర్ - అనీల్ కపూర్ కలిసి నటించిన ఏక్ లడకి కో దేఖా తో ఐసా లగా చిత్రం .. వసూళ్ల పరంగా బాహుబలి దరిదాపుల్లో లేనేలేవు. ఇక కంగన మణికర్ణిక 100కోట్ల క్లబ్ లో చేరే ఛాన్సుంన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు సోనమ్ సినిమాకి సమీక్షలు బావున్నా వసూళ్లు దక్కడం లేదుట. ఇప్పటి సన్నివేశం చూస్తుంటే బాలీవుడ్ లోనే కాదు అసలు ఇండియాలోనే ఇప్పట్లో బాహుబలి -2 రికార్డుల్ని టచ్ చేసే వేరొక సినిమా రానే రాదనే అర్థమవుతోంది. మరోసారి ఆ రికార్డును ప్రభాస్ మాత్రమే బ్రేక్ చేయాల్సి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న సాహో ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న `సైరా-నరసింహారెడ్డి` అంత ఊపు తెస్తుందనే మెగాభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.