Begin typing your search above and press return to search.
పెట్టిన పెట్టుబడికి నాలుగు రెట్ల లాభం
By: Tupaki Desk | 19 Jan 2019 10:07 AM GMTబాలీవుడ్ లో గత కొన్నాళ్లుగా 'సింబా' మినహా మరే సినిమా సక్సెస్ ను దక్కించుకున్న దాఖలాలు లేవు. జస్ట్ పాజిటివ్ టాక్ ను దక్కించుకున్న సింబా మూవీ దాదాపుగా 300 కోట్లను వసూళ్లు చేసింది. అంతటి వసూళ్లను చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఊహించలేదు. పోటీ ఏ సినిమా లేక పోవడం వల్ల అంతటి వసూళ్లు సాధ్యం అయ్యాయి. ఈ సమయంలోనే వచ్చిన 'యూరీ : ది సర్జికల్ స్ట్రైక్' చిత్రానికి మంచి వసూళ్లు వస్తున్నాయి. మొదటి వారం రోజుల్లోనే పెట్టిన పెట్టుబడికి డబ్బుల్ వసూళ్లు నమోదు అయ్యాయి.
కేవలం 28 కోట్ల బడ్జెట్ తో 'సంజు' ఫేం వికీ విశాల్ నటించిన ఈ చిత్రం ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేశ వ్యాప్తంగా కూడా ఈ చిత్రంకు విశేష ఆధరణ దక్కింది. ఈ సంవత్సరంలో బాలీవుడ్ లో అతి పెద్ద సెన్షేషనల్ హిట్ మూవీగా ఈ చిత్రం నిలిచింది. మొదటి వారం రోజుల్లోనే ఈ చిత్రం 75 కోట్ల వరకు రాబట్టినట్లుగా బాలీవుడ్ ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ మిలిటెంట్ స్థావరాలపై దాడులు చేసి, ఆ స్థావరాలను ద్వంసం చేసిన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది.
విడుదలైన మొదటి రోజు సినిమా గురించి పెద్దగా ఎవరు అంచనాలు పెట్టుకోలేదు. దాంతో మొదటి రోజు 8.2 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. ఆ తర్వాత రోజు నుండి కలెక్షన్స్ అనూహ్యంగా పుంజుకున్నాయి. రెండవ రోజు 12.45 కోట్లు, మూడవ రోజు 15 కోట్లు, నాల్గవ రోజు 10.5 కోట్లు ఇలా వసూళ్లు నమోదు అవుతూ వచ్చాయి. అతి త్వరలోనే ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరడంతో పాటు లాంగ్ రన్ లో ఈ చిత్రం 150 నుండి 200 కోట్ల వరకు కూడా వసూళ్లు చేసే అవకాశం ఉందంటున్నారు.