Begin typing your search above and press return to search.
ఊరి విజయం ఓ కనువిప్పు
By: Tupaki Desk | 21 Feb 2019 8:50 AM GMTరిలీజైన వారంలోనే సినిమా తీసేస్తున్న రోజులివి. తొలి వీకెండ్ మూడు రోజుల వసూళ్లను మాత్రమే బాక్సాఫీస్ గణాంకాల్లో పరిగణిస్తున్నారు. ఆ తర్వాత కూడా సినిమా థియేటర్లలో ఉంటే గొప్పే అన్నట్టు చూస్తున్నారు. బాలీవుడ్ కూడా అందుకు అతీతం ఏమీ కాదు. అక్కడా టాప్ స్టార్లు నటించిన సినిమాలు తొలివారంలో ఆడాక రెండో వారంలో ఉంటాయో లేదో కూడా తెలీని పరిస్థితి. సల్మాన్ - షారూక్ - అమీర్ ఖాన్ అంతటి వారికే ఇలాంటి సెగ తప్పలేదు. అయితే తొలి వారాంతానికే హిట్టయిన సినిమా వసూళ్లను కొల్లగొట్టేస్తోంది.
అలాంటిది ఒక వారం.. రెండు వారాలు కాదు.. ఏకంగా ఆరో వారంలోనూ తొలి వారంలానే వసూళ్లు సాధిస్తోంది ఓ సినిమా. యంగ్ హీరో విక్కీ కౌశల్ నటించిన ఆర్మీ బ్యాక్ డ్రాప్ సినిమా `ఊరి: ది సర్జికల్ స్ట్రైక్స్` సాధించిన గ్రేట్ ఫీట్ ఇది. ఇప్పటికే ఈ చిత్రం హిందీ బాక్సాఫీస్ వద్ద `బాహుబలి- 2` రికార్డును బ్రేక్ చేసింది. `గద్దర్` లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల రికార్డుల్ని అధిగమిస్తోంది. బాలీవుడ్ హిస్టరీలోనే అసాధారణ విజయమిదీ అన్న చర్చా సాగుతోంది. ఆరోవారంలో ఇంకా ఆడుతోందా? అంటూ నోరెళ్లబెట్టేలా చేస్తోంది. మొత్తానికి `ఊరి` అంత పెద్ద ఘనవిజయం సాధించడం వెనక అసలు కారణాల్ని ఈ సందర్భంగా విశ్లేషించాలి.
తెల్లారే లోపు తీవ్రవాదుల అంతు చూసిన వీరుల కథ ఇది. దేశభక్తిని రగిలించిన సినిమా. దేశంపై ప్రేమను - గౌరవాన్ని పెంచే సరిహద్దు బ్యాక్ డ్రాప్ కథాంశం కావడం.. సినిమా చూసే వీక్షకుడికి కనెక్టయ్యింది. ఇక ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం అంతే వండర్. కథ - కథనం - దర్శకత్వం - నటన - సంగీతం - సినిమాటోగ్రఫీ... ఇన్ని విభాగాల్లో సత్తా చాటిన చిత్రమిది. ఊరి ఇప్పటికే 227కోట్లు వసూలు చేసింది. బ్లాక్ బస్టర్ `సింబా` రికార్డుని కొట్టేసింది. 250కోట్ల షేర్ వసూలు చేస్తుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. 2019-20 సీజన్ లో జాతీయ అవార్డును దక్కించుకునే సత్తా ఉన్న సినిమాగానూ ప్రచారం సాగుతోంది. ఇది కేవలం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన సినిమాగానే ప్రపంచం గుర్తించడం లేదు. అన్ని భాషల్లో దర్శకనిర్మాతల ఆలోచనా శైలిని మార్చే.. ఆలోచనల్లో విస్త్రతిని పెంచే యూనివర్శల్ యాక్సెప్టెన్సీకి సంబంధించిన విజయంగా పరిగణించాల్సి ఉంటుందనడంలో సందేహమే లేదు. `ఊరి` సినిమా దేశభక్తిని పెంచే.. దేశం గౌరవాన్ని పెంచే సినిమాగా యువతరం గుర్తించింది గనుకే ఇంతటి విజయం దక్కిందని భావించవచ్చు.