Begin typing your search above and press return to search.

చెప్పాపెట్టకుండా వర్మ హీరోయిన్‌ పెళ్ళి

By:  Tupaki Desk   |   4 March 2016 4:20 AM GMT
చెప్పాపెట్టకుండా వర్మ హీరోయిన్‌ పెళ్ళి
X
అప్పటికే హిందీలో ఓ రెండు సినిమాల్లో హీరోయిన్‌ గా చేసినా రాని గుర్తింపు.. తెలుగులో అంతం, ద్రోహి, గాయం సినిమాలతో వచ్చేసింది. ఆ దెబ్బకి రామ్‌ గోపాల్‌ వర్మ హీరోయిన్‌ గా సెక్సిణి ఊర్మిళకు బీభత్సమైన పేరొచ్చింది. మనోడు బాలీవుడ్‌ వెళ్ళి ఆమెతోనే రంగీళ సినిమాను తీసి.. ఆమెను ఒక సూపర్‌ స్టార్‌ చేశాడు. అంతేకాదు.. ఆమె ఒక సెక్సీ క్వీన్‌.. సెక్స్‌ బాంబ్‌.. డ్యాన్సింగ్‌ స్టార్‌.. ఇలా ఎన్నో ఖ్యాతులు పొందిందంటే.. అదంతా శ్రీమాన్‌ శ్రీ వర్మ గారి చలవే.

అయితే అప్పట్లో ఊర్మిళతో ప్రేమలో పడటం కారణంగా వర్మ తన భార్యకు విడాకులిచ్చాడని ఒక టాక్‌. ఆ టాక్‌ టాకున్నర రేంజులో వినిపించినా కూడా.. వీరు ఎప్పుడూ పెళ్ళి మాత్రం చేసుకోలేదు. 2008 వరకు ఫుల్‌ బిజీగా సినిమాల్లో మెరిసిన ఊర్మిళ.. తరువాత ఫేడైంది. టివిలో కనిపించింది. వయస్సు 42 టచ్‌ అయినా.. పెళ్ళి ఊసు మాత్రం ఎత్తలేదు. అయితే ఇప్పుడు సీక్రెట్‌ గా నిన్న మధ్యాహ్నం తన ప్రియడు మొహిసిన్‌ అక్తర్‌ మీర్ ను ముంబయ్‌ లో పెళ్లిచేసుకుందీ భామ.

కాశ్మీర్‌ కు చెందిన బిజినెస్‌ మ్యాన్‌ మొహిసిన్‌.. ముంబయ్‌ లో మోడల్‌ గా పలు యాడ్లలో నటించాడు. డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా ద్వారా వీరికి పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్‌ ఏంటంటే.. ఉర్మిళ కంటే మొహిసిన్‌ 7 ఏళ్ళు వయస్సులో చిన్నవాడట. అది సంగతి.