Begin typing your search above and press return to search.

లేటు వయసులో ఘాటుగా

By:  Tupaki Desk   |   4 Jun 2017 9:33 AM GMT
లేటు వయసులో ఘాటుగా
X
రంగీలా సినిమా ద్వారా రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ లో అడుగెట్టాడు. 1995లో వచ్చిన ఆ సినిమాలో ఊర్మిళ మాతోండ్కర్ చూసిన అప్పటి కుర్రకారుకు రాత్రి నిద్ర పట్టలేదంటే అతిశయోక్తి కాదు. ఊర్మిళ అందచందాలు అందరి మతులు పోగొట్టడమే కాదు.. బాలీవుడ్ ను ఊపేశాయి. ఆ సినిమాతో ఆమె ఫ్యాషన్ ఐకాన్ అయింది. ఒక్క దెబ్బకు ఆమెకు స్టార్ స్టేటస్ వచ్చేసింది. దాదాపు దశాబ్ద కాలం బాలీవుడ్ లో ఆమె హవా నడిచింది. 2008 తర్వాత ఆమె వెండితెరకు దాదాపుగా దూరమైంది.

హీరోయిన్లకు ఫేమ్ తగ్గిపోయాక ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లిపోయి పెళ్లి చేసుకుని సెటిలవడమో... లేదా వేరే రంగంలో సెటివలడానికి ప్రయత్నించడమో చేస్తుంటారు. కొంత కాలం తర్వాత తిరిగి వచ్చి తల్లి పాత్రలు సపోర్టింగ్ క్యారెక్టర్లు చేస్తూ తిరిగి లైమ్ లైట్ లోకి వస్తుంటారు. నదియా మధుబాల ఇంద్రజ లాంటివారంతా ఇలాగే పేరు తెచ్చుకున్నారు. ఈ విషయంలో ఊర్మిళ నా రూటు సెపరేటు అంటోంది. 43 ఏళ్ల ఈ సుందరాంగి తిరిగి వెండితెరపై మరోసారి కనిపించనుంది. కాకుంటే సపోర్టింగ్ రోల్ లో కాదు. ఐటం సాంగ్ తో రీ ఎంట్రీ ఇస్తోంది. త్వరలో ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రధారిగా వస్తున్న హిందీ ఫిలింలో ఊర్మిళ తన అందచందాలతో మరోసారి విందు చేయడానికి సిద్ధమైంది.

హీరోయిన్ గా నటించే సమయంలో చైనా గేట్ సినిమాలో ఊర్మిళ ఓ ఐటం సాంగ్ చేసింది. ఛమ్మాఛమ్మా అంటూ సాగే ఈ పాట సూపర్ హిట్ అయింది. ఈ పాట ఊర్మిళకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇంతవరకు ఎవరూ ప్రయత్నించని విధంగా లేట్ వయసులో ఐటం సాంగ్ తో రీ ఎంట్రీ ఇవ్వాలన్న ఊర్మిళ ఐడియా అదిరింది. ఈ ఐడియా క్లిక్ అయితే మరింత మంది నటీమణులకు కొత్త దారి దొరికినట్లవుతుంది. ఆల్ ది బెస్ట్ ఊర్మిళా...

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/