Begin typing your search above and press return to search.

ఊరించే అందాలతో ఊపేస్తున్న ఊర్వశి..

By:  Tupaki Desk   |   14 April 2020 5:30 PM GMT
ఊరించే అందాలతో ఊపేస్తున్న ఊర్వశి..
X
బాలీవుడ్ లో ఆకర్షించే అందం ఉన్న హీరోయిన్లలో ఊర్వశి రౌటేలా ఒకరు. ఈ ముద్దుగుమ్మ తన అందచందాలు, గ్లామర్‌తో ఎల్లప్పుడూ యూత్ ని ఊపేస్తోంది. సోషల్ మీడియాని తన ఫొటో షూట్లతో మైమరపిస్తోంది. బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ భామ సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌గా దర్శనమిస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఆమె మరోసారి తన అందాల ప్రదర్శనతో ఇంస్టాగ్రామ్ ని హీటెక్కించింది. 'సింగ్ సాబ్ ది గ్రేట్' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఊర్వశి రౌతేలా 'హేట్ స్టోరీ 4' చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ సినిమా లో ఆమె హాట్ హాట్ అందాల ప్రదర్శన బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారేలా చేసింది. అన్నీ విషయాలలో క్లారిటీగా ఉండటమే ఆమె నైజం. అయితే వెండితెర మీద అందాలు ఆరబోయందే సక్సెస్‌ కాలేరు అన్న విషయం ఆమె ఒప్పుకోదు.

అలాగని మనం ఉన్నదే గ్లామర్‌ ఫీల్డ్‌ ఉన్నప్పుడు మడికట్టుకుని కూర్చుంటే కుదరదు కదా అంటోందట. కెరీర్ పరంగా ఎదగాలంటే జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పవు. ముఖ్యంగా నటి కావాలనుకున్న వారు ఇలాంటి అభ్యంతరాలు అస్సలు పెట్టుకోకూడదు అని డిసైడ్ అయ్యాకే తను సినీ ఫిల్డ్ కు వచ్చానంటోంది. బాలీవుడ్ హాట్ భామ ఊర్వశి రౌతేలాకు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసే ఫోటోలను చూస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే. హాట్ పిక్స్‌తో మిలియన్ల ఫాలోవర్స్‌కు కిక్కిస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఈ ముద్దుగుమ్మ అప్లోడ్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైట్ డ్రెస్ లో అమ్మడి అందాలు కుర్రకారుకి పిచ్చెక్కిస్తున్నాయి. ఇవి చూసిన తర్వాత ఆ వేడి తట్టుకోవడం కూడా కష్టమే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటో ట్రెండింగ్ లో ఉంది.