Begin typing your search above and press return to search.

ఊస‌ర‌వెల్లిలా రంగులు మారుస్తున్న‌ ఊర్వ‌శి

By:  Tupaki Desk   |   24 April 2022 12:30 AM GMT
ఊస‌ర‌వెల్లిలా రంగులు మారుస్తున్న‌ ఊర్వ‌శి
X
క్ష‌ణానికో రంగు మార్చే ల‌క్ష‌ణాన్ని ఊస‌ర‌వెల్లితో పోల్చేస్తాం. ఇదే త‌ర‌హా క్వాలిటీస్ రంగుల మాయా ప్ర‌పంచంలో కొంద‌రికే సాధ్యం. అతికొద్ది మంది జాబితాలో ఉంది ఊర్వ‌శి రౌతేలా. హేట్ స్టోరీ 4 బ్యూటీ నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌తో సంచ‌ల‌నంగా మారుతోంది.

తాజాగా ఊర్వ‌శి షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది. ఇందులో ఈ అమ్మ‌డి రూపం పూర్తిగా మారిపోయింది. మేక‌ప్ టూమ‌చ్ గా డామినేట్ చేసిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. నిజానికి ఇది ఎవ‌రో క‌నిపెట్ట‌డం అంత సులువేమీ కాదు. చూడ‌గానే ఊర్వ‌శి అని అన‌లేం. నిజానికి ఇదే ఫోటోషూట్లో కొన్ని భంగిమ‌ల్లో మాత్ర‌మే ఊర్వ‌శి ఒరిజిన‌ల్ రూపం క‌నిపిస్తోంది.

ఇక ఇటీవ‌ల ఊర్వ‌శి వేగంగా మారిన రూపం చూస్తుంటే షాక్ త‌గులుతోంది. ఇంత‌కుముందు ముద్దుగా బొద్దుగా క‌నిపించిన ఈ బ్యూటీ ఐశ్వ‌ర్యారాయ్ సిస్ట‌ర్ లా మెరుపుతీగ‌లా మారింది. తాజా లుక్ లో బ్లాక్ డిజైన‌ర్ డ్రెస్ ధ‌రించిన ఊర్వ‌శి ఎంతో ప్ర‌త్యేకంగా క‌నిపిస్తోంది. కానీ త‌న రూపాన్ని డామినేట్ చేసేంత‌గా మేక‌ప్ ని అద్దిన విధానం విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటోంది. ఇక కొంత‌కాలంగా ఊర్వ‌శికి అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. దీంతో ఊహించ‌ని రీతిలో ఇలా ప్ర‌యోగాల‌కు శ్రీ‌కారం చుడుతోంద‌ని విమ‌ర్శ‌లొస్తున్నాయి. అయినా మ‌రీ ఇంత‌గా ఊస‌ర‌వెల్లిలా రంగులు మారుస్తున్న‌ ఊర్వ‌శిని న‌మ్మేదెలా.. న‌మ్మి అవ‌కాశ‌మిచ్చేదెలా? అంటూ నిర్మాత‌లు వాపోతే స‌న్నివేశం ఎలా ఉంటుందో ఊహించండి! అంటూ కూడా స‌ర‌దా కామెంట్లు చేస్తున్నారు యూత్.

నియోజ‌క‌వ‌ర్గంలో ఊర్వ‌శి హంగామా హేట్ స్టోరి 4 .. గ్రేట్ గ్రాండ్ మస్తీ చిత్రాలతో మ‌త్తెక్కించిన ఊర్వ‌శి త్వ‌ర‌లోనే టాలీవుడ్ లో సంద‌డి చేయ‌బోతోంది. మోడ‌లింగ్ .. బుల్లితెర‌ను ఏలిన ఈ బ్యూటీ అందాల రాణిగా కిరీటం గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే. నిజానికి బ‌న్ని న‌టించిన పుష్ప‌లో ఐట‌మ్ నంబ‌ర్ చేస్తుంద‌ని ప్ర‌చార‌మైనా కానీ అది కుద‌ర‌లేదు. తాజా నివేదిక ప్రకారం.. బాలీవుడ్ ఐట‌మ్ బాంబ‌ర్ ఊర్వశి రౌతేలా నితిన్ హీరోగా న‌టిస్తున్న 'మాచర్ల నియోజకవర్గం'లో ట్రీటివ్వ‌నుంద‌ని టాక్ ఉంది.

అధికారికంగా ఎటువంటి ధృవీకరణ లేకోయినా ఈ పొలిటికల్ డ్రామాలో ఊర్వశి రౌతేలా ప్రత్యేక పాటలో న‌ర్తించ‌నుంద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నార‌ని కూడా గుస‌గుస వినిపించింది. మాచర్ల నియోజకవర్గం టైటిల్ కి త‌గ్గ‌ట్టే రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న సినిమా. ఎం.ఎస్ రాజ శేఖర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్ర‌ఫీ అందించ‌గా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వ‌ర్క్ అందిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి- నికితారెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీలో 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. 29 ఏప్రిల్ 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది.

బోల్డ్ కంటెంట్ తో విరుచుకుప‌డ‌డంలో ఊర్శశి త‌ర్వాతే. హ‌ద్దులు చెరిపేసి అందాల ఆర‌బోత‌తో వేడెక్కించ‌డంలో స్పెష‌లిస్ట్ టాలీవుడ్ లో అడుగుపెడుతోంది అంటే మాస్ కి థియేట‌ర్ల‌లో జాత‌రే. ప్ర‌స్తుతం బ్లాక్ రోజ్ అనే తెలుగు చిత్రంలో న‌టిస్తోంది. పుష్ప 1లో మిస్స‌యినా పుష్ప 2 లో ఈ అమ్మ‌డి ట్రీట్ ఉండే ఛాన్సుంది. ప‌లు ఇత‌ర తెలుగు చిత్రాల్లోనూ ఊర్వ‌శి న‌టిస్తోంద‌న్న స‌మాచారం ఉంది. కానీ అధికారిక స‌మాచారం రావాల్సి ఉంది.