Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: ఇది పిల్ల ఛాలెంజ్

By:  Tupaki Desk   |   20 April 2020 11:35 AM GMT
ఫోటో స్టోరీ: ఇది పిల్ల ఛాలెంజ్
X
బాలీవుడ్లో చురకత్తుల లాంటి భామలకు లోటేమీ లేదు. ఈ భామలు అందరూ ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో తమకు తగ్గట్టుగా టైం పాస్ చేస్తూ తాము ఏం చేస్తున్నారు అనే విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ కాలం గడుపుతున్నారు. ఈ లాక్ డౌన్ సమయంలో హాట్ నెస్ డోస్ ను పెంచి రోజూ ఒక ఫోటో వదులుతూ నెటిజన్లను ఊపిరి సలపకుండా చేస్తున్న ఘాటు అందం ఊర్వశి రౌతేలా.

ఈ భామ తాజాగా తన ఇన్స్టాద్వారా ఒక కొత్త ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటోకు "ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్.. రైటింగ్.. యాక్టింగ్ సెషన్స్.. పాత్రలను డెవలప్ చేయడం.. నటన ఎలా ఉండాలో డిజైన్ చేయడం లాంటి ఎన్నో విషయాలను నటాలి పోర్ట్ మాన్ దగ్గర నేర్చుకునేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నా" అంటూ ప్రస్తుతం ఏం చేస్తుందో వివరించింది. లాక్ డౌన్ అనగానే చాలామంది ఇంటి పనులతో లేదా కసరత్తులు లాంటి ఒంటి పనులతో లేదా ఫోటో స్టోరీలు చదవడం లాంటి కొంటెపనులతో.. కాలం గడుపుతూ ఉన్నారు. కానీ ఈ భామ మాత్రం సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను నేర్చుకోవాలని కంకణం కట్టుకున్నట్టు ఉంది. అదే తనకు క్యాప్షన్ లో చెప్పింది. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే.. అన్నట్టు క్యాప్షన్ క్యాప్షనే.. హాట్ ఫోటో హాట్ ఫోటోనే. అందుకే ఓ కత్తిలాటి ఫోటోను షేర్ చేసింది.

ఫోటోలో ఊర్వశి డ్రెస్ ఎలా ఉంది అంటే పిల్లో ఛాలెంజ్ స్ఫూర్తిగా తీసుకొని డ్రెస్ ను ఒక పిల్లో లాగా డిజైన్ చేసినట్టు ఉంది. ఆది పిల్లో ఛాలెంజ్ అయితే ఇది హాట్ పిల్ల ఛాలెంజ్ అనుకోవచ్చు. చాలెంజి ఏదేమైనా కానివ్వండి ఊర్వశి అందాల విందును మాత్రం మర్చిపోలేదు. ఆ నిలుచున్న విధానం.. ఎక్స్ ప్రెషన్ చూస్తే ఎలాంటి స్త్రీ ద్వేషి అయినా.. షీ ప్రేమికుడుగా మారిపోవడం ఖాయం. ఈ ఫోటోకు ఎప్పటిలాగానే లక్షల లైకులు వచ్చాయి. ఇక ఊర్వశి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'వర్జిన్ భానుప్రియ' అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.