Begin typing your search above and press return to search.

ఓరచూపుతో ఒంపులన్నీ ఆరబోస్తున్న ఊర్వశి..

By:  Tupaki Desk   |   29 April 2020 9:30 AM GMT
ఓరచూపుతో ఒంపులన్నీ ఆరబోస్తున్న ఊర్వశి..
X
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ క్వీన్ ఎవరంటే ఠక్కున చెప్పే పేర్లలో ఊర్వశి రౌటేలా పేరు కూడా ఉంటుంది. ఈ బ్యూటీ గ్లామర్‌ కి యూత్ మొత్తం ఆకర్షణకులోనై ఊర్వశిని ఆరాధిస్తున్నారు. సోషల్ మీడియాను ఎప్పటికప్పుడు తన ఫొటో షూట్లతో వేడెక్కిస్తోంది. హిట్లు ప్లాపులు లెక్కచేయకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ భామ సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌గా దర్శనమిస్తుంది. తాజాగా ఊర్వశి మరోసారి తన అందాల ప్రదర్శనతో ఇంస్టాగ్రామ్ ని షేక్ చేస్తుంది. ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఊర్వశి ‘హేట్ స్టోరీ 4’ చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ సినిమాలో ఆమె అందాల ప్రదర్శనకు బీ టౌన్ హీటెక్కిపోతుంది.

తాజాగా ఊర్వశి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. ఊర్వశికి సోషల్ మీడియాలో కోట్లలో ఫాలోయింగ్ ఉంది. ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసే ఫోటోలను చూస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే. హాట్ పిక్స్‌తో మిలియన్ల ఫాలోవర్స్‌కు కిక్కిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ అప్లోడ్ చేసిన జిమ్ లో ప్రాక్టీస్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రాక్టీస్ సెషన్లో అమ్మడి ఫోజులకు ఫిదా అవుతున్నారు. అందాలన్నీ ఒక వైపుగా వాల్చి లైఫ్ ని ఎక్కువగా హర్ట్ చేసేది ఏది అంటూ టాగ్ లైన్ పోస్ట్ చేసింది. ఊర్వశిని ఆ వంగిన పోజులో చూసినవారంతా బాలీవుడ్ అందాల ఒంపులన్నీ అమ్మడి ఓరచూపులోనే ఉన్నాయంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటో ట్రెండింగ్లో ఉంది.