Begin typing your search above and press return to search.

టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ల‌కి చుక్క‌లు చూపిస్తోంద‌ట‌

By:  Tupaki Desk   |   17 Sep 2020 11:30 PM GMT
టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ల‌కి చుక్క‌లు చూపిస్తోంద‌ట‌
X
బాలీవుడ్ హాట్ ఆట‌మ్ బాంబ్ ఊర్వ‌శీ రౌతేలా. సోష‌ల్ మీడియాతో పాటు బాలీవుడ్‌లో త‌నదైన హాట్ నెస్‌ తో హీటెక్కించేస్తోంది. ఇన్‌స్టా లో ఈ భారీ క్రేజ్ మామూలుగా లేదు. 30 మిలియ‌న్ ‌ల మంది ఊర్వ‌శిని ఫాలో అవుతారంటే ఈ హాట్ లేడీ క్రేజీ ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవ‌చ్చ‌. అయితే తెలుగు ప్రేక్ష‌కుల‌కు మాత్రం ఈ సుంద‌రి కొత్తే. అయినా తెలుగు వారిని మెస్మ‌రైజ్ చేయ‌డానికి వెబ్ సిరీస్ ‌తో ఎంట్రీ ఇస్తోంది.

సంప‌త్‌నంది స్టోరీ స్క్రీన్‌ప్లే అందిస్తున్న `బ్లాక్ రోజ్‌` వెబ్‌ సిరీస్ ‌తో ఎంట్రీ ఇస్తోంది. కె.కె. రాధామోహ‌న్ ఈ వెబ్ సిరీస్‌ ని నిర్మిస్తున్నారు. హైద‌రాబాద్‌ లో షూటింగ్ జ‌రుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 10 రోజులు షూటింగ్ పూర్త‌యింది. దీంతో ఊర్వ‌శి ముంబై తిరిగి వెళ్లిపోయింది. అయితే ఊర్వ‌శి ఖ‌ర్చులు చూసి నిర్మాత గుండె గుభేలు మంద‌ట‌. ఒప్పుకున్న రెమ్యున‌రేష‌న్‌ తో పాటు అద‌నంగా కావాలంటోంద‌ట‌.

కోవిడ్ కార‌ణంగా బ‌డ్జెట్ త‌గ్గించుకోవాల‌ని నిర్మాత‌లు చూస్తుంటే ఊర్వ‌శి మాత్రం డ‌బ్బులు డిమాండ్ చేస్తోంద‌ట‌. స‌ర్వీస్ అపార్ట్ ‌మెంట్‌ లో వుండి స‌హ‌క‌రించ‌మ‌ని కోరితే తాను నోవాటెల్‌ లో మాత్ర‌మే వుంటాన‌ని కండీష‌న్ పెట్టింద‌ని తెలిసింది. దీనికి తోడు త‌ను షూటింగ్ ప్లేస్‌కి రావ‌డానికి బెంజ్ ల‌గ్జ‌రీ కార్ ప్ర‌తీ రోజు అంటే షూటింగ్ జ‌రిగిన‌న్ని రోజులు పంపించాల‌ని డిమాండ్ చేసింద‌ట‌. ఇలా అయితే ఊర్వ‌శి తెలుగులో సినిమాలు చేయ‌డం క‌ష్ట‌మే అంటున్నారు టాలీవుడ్ జ‌నాలు.