Begin typing your search above and press return to search.

ఇట్ట‌గైతే ఎట్టా ఊర్వశీ.. బాస్ లోని గ్రేస్ ఏద‌మ్మా?

By:  Tupaki Desk   |   24 Nov 2022 2:30 AM GMT
ఇట్ట‌గైతే ఎట్టా ఊర్వశీ.. బాస్ లోని గ్రేస్ ఏద‌మ్మా?
X
బాస్ పార్టీ అంటే ఆషామాషీనా? బాస్ లోని గ్రేసు.. మాస్ ఎలివేష‌న్.. ఆ ఎన‌ర్జీని మ్యాచ్ చేయాలంటే ఎవ‌రివ‌ల్ల‌యినా సాధ్య‌మేనంటారా? ఏం చేసినా ప‌రాకాష్ట‌లో పండాల్సిందే. బాస్ స్టెప్పేస్తే.. బాస్ పెగ్గేస్తే.. బాస్ సిగ‌రెట్ వెలిగిస్తే .. బాస్ కాలరెగ‌రేస్తే.. పూల చొక్కాయ్ గ‌ళ్ల‌పంచెతో అలా అలా న‌డిచొస్తుంటే బాస్ స్టైలే ఆ లెవ‌ల్ క‌దమ్మా!

కానీ ఇక్క‌డేంటి.. ఈవిడ బాస్ ని అనుక‌రించ‌బోయి మునగ చెట్టెక్కింది? ఇదా బాస్ లోని గ్రేసు.. బాస్ లోని మాసిజం? ఆ ఎక్స్ ప్రెష‌న్ ఒంట్లో పొగ‌రు ఒగరు ఇంకా చాలా చాలా అచ్చు గుద్దాలి. సేమ్ టు సేమ్ అచ్చు గుద్దిన‌ట్టు ముఠామేస్త్రి స్టెప్పు దించేయాలంటే అంత ఈజీ కాదు. అందుకే పాపం ఊర్వ‌శి అంత‌గా తెగ శ్ర‌మిస్తోంది. కానీ ఓ ప‌ట్టాన అస‌లు బాస్ లోని ఊపు ఓ ప‌ట్టాన క‌నిపించ‌డం లేదు ఆ బాడీ లాంగ్వేజ్ లో.. స్టెప్పులో.

పాదం క‌దిపేట‌ప్పుడే చాలా త‌డ‌బ‌డుతోంది. అయినా ఏంటిది ఊర్వ‌శీ.. ఈ ప్రాక్టీస్ స‌రిపోదమ్మా.. ఇంకా చాలా హార్డ్ వ‌ర్క్ చేయాల్నా! ఈ మాత్రం ప్రాక్టీస్ తో చ‌ర‌ణ్ లు బ‌న్నీలు త‌యార‌వ్వ‌లేద‌మ్మా.. అది వేరే లెవ‌ల్ లో ఉంటుంది. బాలీవుడ్ హాలీవుడ్ కోలీవుడ్.. ఎక్క‌డా లేద‌మ్మా బాస్ లోని ఆ హుషారు.. జోష్‌! అందుకే క‌దా ``బిగ్గ‌ర్ దేన్ ది అమితాబ్`` అని జాతీయ ప‌త్రిక‌లు హెడ్డింగులు పెట్టి మ‌రీ మెగాస్టార్ చిరంజీవిని పొగిడేసింది. బాస్ లో అంతుంది కాబ‌ట్టే ఫాలోయింగ్ కూడా ఆ రేంజులోనే ఉంటుంది.

మెగాస్టార్ కోట్లాది మంది ఫ్యాన్స్ ని మెప్పించాలంటే ముఠామేస్త్రిలోని ఐకానిక్ సాంగ్ కోసం ఊర్వ‌శికి ఇది స‌రిపోదు.. ఇంకా చాలా శ్ర‌మించాల్సి ఉంటుంది. తాజాగా చిరు బాస్ పార్టీ సాంగ్ కోసం ఐకానిక్ స్టెప్ రీక్రియేట్ అవుతుందా? లేదా అన్న‌ది వేచి చూడాలి.

`వాల్తేరు వీరయ్య` ఫస్ట్ సింగిల్ రిలీజ్ కావడంతో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఇప్ప‌టికే ఫుల్ ఖుషీగా ఉన్నారు. బాస్ పార్టీ అంటూ సాగే ఈ పాట మాస్ కోసం ఉద్ధేశించిన‌ది. దేవిశ్రీ ప్రసాద్ మాస్ బీట్‌ బాగానే వ‌ర్క‌వుటైంది. చిరంజీవి మ్యాజిక‌ల్ నృత్య కదలికలు వీక్షకులను క‌ట్టిప‌డేసాయి. కానీ ఈ పెప్పీ సాంగ్ లో ఓ డ్యాన్స్ బిట్ కోసం బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా నానా తంటాలు ప‌డుతోంది.

కొద్దిసేపటి క్రితం.. ఊర్వశి తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అక్కడ బాస్ పార్టీ పాట కోసం స్టెప్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది. ఈ స్టెప్ `ముఠామేస్త్రి` సినిమాలో చిరు ఐకానిక్ స్టెప్ ని పోలి ఉంది. అక్కడ బాస్ లోని గ్రేస్ వేరే లెవ‌ల్. అత‌డి బాడీ లాంగ్వేజ్ డ్యాన్సింగ్ మూవ్ మెంట్ టైమింగ్ దేనినీ ఇత‌రులు స‌రిపోల‌లేరు. ఊర్వ‌శి కూడా మ్యాచ్ చేయ‌లేక‌పోతోంది.

కానీ పాపం ఊర్వశి చాలా ట్రై చేస్తోంది. అయితే ఇది కేవ‌లం ప్రాక్టీస్ వీడియో అని భావించాలి. చిరు- ఊర్వశి కలిసి మళ్లీ అదే ఐకానిక్ స్టెప్ రిపీట్ చేస్తారని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇది నిజమో కాదో ఇంకా క్లారిటీ లేదు. దీనిపై టీమ్ వివ‌ర‌ణ ఇవ్వాల్సి ఉంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మాస్ మహారాజా రవితేజ కూడా కీలక పాత్రను పోషిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.