Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మ‌ట్ట‌గిడ‌సలా జారుకున్న ఊర్వ‌శి!

By:  Tupaki Desk   |   31 Dec 2022 5:55 PM GMT
ఫోటో స్టోరి: మ‌ట్ట‌గిడ‌సలా జారుకున్న ఊర్వ‌శి!
X
ఊర్వ‌శి రౌతేలా పేరు స్ట్రైక్ అవ్వ‌గానే అభిమానులు వెంట‌నే యువ‌క్రికెట‌ర్ రిషబ్ పంథ్ ని త‌లుచుకుంటారు. అంత‌గా ఆ ఇద్ద‌రి మ‌ధ్యా వివాదం నెటిజ‌నుల్లో చ‌ర్చ‌గా మారింది. ఇటీవ‌ల నెమ్మ‌దిగా ఈ కాంట్ర‌వ‌ర్శీ స‌ద్దుమ‌ణిగాక ఊర్వ‌శి పూర్తిగా కెరీర్ పై దృష్టి సారించింది. ముఖ్యంగా సౌత్ సినిమాపై ఊర్వ‌శి క‌న్ను ప‌డింది. ఎలా అయినా ఇక్క‌డ స్టార్ హీరోయిన్ గా ఒక ఊపు ఊపాల‌ని క‌సితో ఉంది. వాల్తేరు వీర‌య్య‌లో ఐట‌మ్ నంబ‌ర్ లో న‌ర్తించిన ఈ బ్యూటీ కొత్త సంవ‌త్స‌రంలో టాలీవుడ్ నుంచి చాలా ఆశిస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ అగ్ర హీరోలు త‌న‌కో ఛాన్స్ ఇస్తార‌ని చాలా హోప్ తో ఉంది.

మాస్ వీర‌య్య‌తో అదిరిపోయే స్టెప్పులేసిన హేట్ స్టోరి -4 బ్యూటీ విజువ‌ల్స్ ఫోటోలు ఇప్ప‌టికే అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి. వీటికి లైక్ లు క్లిక్ లు హోరెత్తుతున్నాయి. మెగా ఫ్యాన్స్ లోను ఊర్వ‌శి ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. ఇప్పుడు ఊర్వ‌శి ఏ ఫోటోనో లేదా వీడియోనో షేర్ చేస్తే అది ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న మెగా ఫ్యాన్స్ లో వైర‌ల్ గా మారుతోంది. అలా త‌న ఇన్ స్టా అనుచ‌రుల‌ను పెంచుకోవ‌డంలో స‌ఫ‌ల‌మైంది. ఇప్ప‌టికే దాదాపు 6 కోట్ల మంది (59.5 మిలియన్ల) అనుచ‌రులు ఊర్వ‌శిని సోష‌ల్ మీడియాల్లో అనుస‌రిస్తున్నారంటే త‌న‌కు ఎంత ఫాలోయింగ్ ఉందో ఊహించ‌వ‌చ్చు.

కొత్త సంవ‌త్స‌రం ట్రీట్ కొత్త‌గా ఉండాల‌ని త‌పించిన ఈ బ్యూటీ ఇప్పుడు అభిమానుల‌కు ఇలా బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ లో స్పెష‌ల్ ట్రీటిచ్చింది. బ్లాక్ లెద‌ర్ ఫ్రాక్ లో హాట్ గా ద‌ర్శ‌న‌మిచ్చింది. న్యూఇయ‌ర్ ఈవెంట్ లో త‌న ప్ర‌ద‌ర్శ‌న కోసం బ‌య‌ల్దేరిన ఈ అమ్మ‌డిని ఇలా విమానాశ్ర‌యంలో ఫోటోగ్రాఫ‌ర్లు క్యాచ్ చేశారు. త‌మ కెమెరాల్లో ఊర్వ‌శి అందాల‌ను బంధించారు. బ్లాక్ లెద‌ర్ ఫ్రాక్ ఊర్వ‌శి దేహ‌శిరుల్ని పూర్తి టైట్ గా క‌మ్మేయ‌డంతో కాస్త అనీజీగా ఇబ్బందికి గురవుతోంద‌ని ఈ వీడియో చూసిన వారికి ఇట్టే అర్థ‌మ‌వుతుంది. చ‌క్క‌న‌మ్మ అలా థైస్లిట్ ఫ్రాక్ లో న‌డిచొస్తుంటే చాలా జాగ్ర‌త్త ప‌డాల్సి వ‌చ్చింది. ఓవైపు కెమెరా క‌ళ్లను మ్యానేజ్ చేస్తూనే అక్క‌డి నుంచి తెలివిగా జారుకుంది. ఎంత ఒడిసిప‌డదామ‌న్నా జారుకున్న మ‌ట్ట‌గిడ‌స‌! అంటూ అభిమానులు ఈ ఫోటోపై వ్యాఖ్యానిస్తున్నారు.

హేట్ స్టోరి 4 .. గ్రేట్ గ్రాండ్ మస్తీ చిత్రాలతో ఊర్వ‌శి రౌతేలా న‌టిగా నిరూపించుకుంది. అందాల రాణిగా కిరీటం గెలుచుకున్న ఈ బ్యూటీ మోడ‌లింగ్ చేస్తూనే బుల్లితెర‌ను ఏలిన సంగ‌తి తెలిసిందే. ఊర్వ‌శి ఈపాటికే టాలీవుడ్ లో వ‌రస చిత్రాల్లో న‌టించాల్సి ఉన్నా కొన్ని కార‌ణాల వ‌ల్ల కుద‌ర‌లేదు. ఇంత‌కుముందు బ‌న్ని న‌టించిన పుష్ప‌లో ఐట‌మ్ నంబ‌ర్ చేస్తుంద‌ని ప్ర‌చార‌మైనా కానీ ఆ ఛాన్స్ స‌మంత‌కు ద‌క్కింది. ప్ర‌స్తుతం ప‌లు హిందీ చిత్రాల‌కు సంత‌కాలు చేసింది. వాటి వివ‌రాల్ని కొత్త సంవ‌త్స‌రంలో వెల్ల‌డించ‌నుంద‌ని తెలిసింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.