Begin typing your search above and press return to search.

క‌రోనా మాస్క్ విలువ రూ.3 కోట్లు.. ధ‌రించిన హీరోయిన్‌!

By:  Tupaki Desk   |   12 April 2021 9:30 AM GMT
క‌రోనా మాస్క్ విలువ రూ.3 కోట్లు.. ధ‌రించిన హీరోయిన్‌!
X
ప‌ది రూపాయ‌ల‌కు ల‌భించే మాస్కు గురించి తెలుసు. మూడ్నాలుగు వంద‌లుండే ఎన్‌90 మాస్కు గురించి కూడా తెలుసు.. చివ‌ర‌కు హీరోలు, సెల‌బ్రిటీలు వేసుకొనే రెండు, మూడు వేల ఖ‌రీదైన మాస్కును కూడా చూసేఉంటారు. కానీ.. ఓ హీరోయిన్ ధ‌రించిన ‌మాస్కు ధ‌ర తెలిస్తే గుడ్లు తేలేస్తారు.

వేలు కాదు.. ల‌క్ష‌లు కాదు.. ఏకంగా కోట్లే! రూ.3 కోట్ల విలువైన క‌రోనా మాస్క్ ధ‌రించింది ఓ హీరోయిన్‌. ఆమె మ‌రెవ‌రో కాదు బాలీవుడ్ బ్యూటీ ఊర్వ‌శీ రౌతెలా. హీరోయిన్ గా స‌త్తా చాట‌లేక‌పోయిందిగానీ.. మోడ‌ల్ గా దూసుకెళ్తోంది ఊర్వ‌శి.

హాట్ హాట్ ఫొటో షూట్ ల‌తో రెచ్చిపోయే ఊర్వ‌శికి.. బోల్డ్ గా క‌నిపించడం మ‌హా స‌ర‌దా. మ‌త్తెక్కించే చిత్రాల‌తో నిత్యం వార్త‌ల్లో నిలిచే ఈ అమ్మ‌డు.. ఇప్పుడు అత్యంత ఖ‌రీదైన మాస్కు ధ‌రించి జ‌నాల నోళ్ల‌లో నానుతోంది.

ఇంత ధ‌ర ప‌ల‌క‌డానికి ఇందులో ప్ర‌త్యేక‌త ఏంట‌ని అనుకుంటున్నారా? దాన్ని డైమండ్స్ తో త‌యారు చేశారు. మొత్తం వ‌జ్రాలు పొదిగిన ఈ మాస్కు.. ధ‌గ‌ధ‌గా మెరిసిపోతోంది. ఈ మాస్కును ధ‌రించిన ఊర్వ‌శి.. ఓ చిన్న‌పాటి వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది. ఇది చూసిన వారంతా త‌మ ఫీలింగ్స్ ను కామెంట్ల రూపంలో తెలియ‌జేస్తున్నారు.