Begin typing your search above and press return to search.
రామ్ పేరును వివాదంలోకి లాగిన ముద్దుగుమ్మ
By: Tupaki Desk | 2 Dec 2022 1:41 PM GMTబాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతెల్లా మరియు స్టార్ టీం ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ కి మధ్య ఉన్న విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరు గతంలో ఒకరంటే ఒకరు ఇష్టం అన్నట్లుగా ఉన్నారు.. పీకల్లోతు ప్రేమలో మునిగి తేలారు అనే ప్రచారం కూడా జరిగింది. అధికారికంగా వారు ఆ విషయాన్ని చెప్పలేదు కానీ మీడియా లో మాత్రం పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
రిషబ్ పంత్ ఆ మధ్య సోషల్ మీడియాలో ఊర్వశి ని బ్లాక్ చేయడం.. ఆ తర్వాత పదే పదే ఊర్వశి రౌతెల్లా తన సోషల్ మీడియా పోస్ట్ లో రిషబ్ పంత్ గురించి ప్రస్థావించడం చేసేది. ఈ మొత్తం వ్యవహారం తో ఊర్వశి కి కావాల్సినంత పబ్లిసిటీ దక్కింది. దాంతో బాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడికి నటించే అవకాశాలు దక్కాయి.
ఇటీవల ఈ అమ్మడు మిస్టర్ ఆర్ పీ అంటూ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ చాలా మంది రిషబ్ పంత్ గురించి అనుకున్నారు. కాని తాజాగా ఈ అమ్మడు స్పందిస్తూ నేను ఆర్ పీ అంటూ పోస్ట్ పెట్టింది రామ్ పోతినేని గురించి. అతడు నా సహ నటుడు. అయితే ఇప్పుడు తెలిసిన విషయం ఏంటీ అంటే రిషబ్ పంత్ ను కూడా ఆర్ పీ అంటారట.
రిషబ్ పంత్ ను కూడా ఆర్ పీ అంటారు అనే విషయం తెలియక నేను అలా పెట్టాను. కానీ నా ఉద్దేశ్యం నేను పెట్టింది మాత్రం రామ్ పోతినేని అన్నట్లుగా ఈ అమ్మడు అనూహ్యంగా రామ్ పోతినేని పేరును వివాదంలోకి లాగింది. మరి రామ్ దీనికి ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.