Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: బెడ్ రూమ్ లో అప్సరస!

By:  Tupaki Desk   |   8 April 2020 11:10 AM GMT
ఫోటో స్టోరీ: బెడ్ రూమ్ లో అప్సరస!
X
బాలీవుడ్ లో హాటు భామల జనాభా ఎక్కువే. సాధారణంగా వాళ్ళందరూ ఏదో ఒక బీచ్ లోనో.. లేదా ఏదైనా ఫారెన్ లొకేషన్ లోనో సేదదీరుతూ కత్తిలాంటి ఫోటోలు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా పోస్ట్ చేస్తూ సమ్మర్ కు హాట్ వెల్కమ్ చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు బీచులకు ఫారెన్ వెకేషన్ల ఖేల్ ఖతం దుకాన్ బంద్ అయింది. లాక్ డౌన్ కాబట్టి ఇంట్లోనే కత్తి లాంటి ఫోటోలు తీసుకుని వాటిని తమ సోషల్ మీడియాలోని ఘాటు ఉద్యమాలను నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు. బాలీవుడ్ లో ఉండే అప్సరసలలో ఒకరైన ఊర్వశి రౌతేలా కూడా ఇదే బాట పట్టింది.

తాజాగా ఈ భామ ఓ బెడ్ రూమ్ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోకు తను క్యాప్షన్ ఇవ్వకుండా ఫాలోయర్లనే క్యాప్షన్ ఇవ్వాలని సూచిస్తూ 'బెస్ట్ క్యాప్షన్ గెలుస్తుంది' అంటూ రెచ్చగొట్టింది. అసలే బెడ్ రూమ్ లొకేషన్. ఫోటోలో లేసులు ఉండే ఒక శాటిన్ నైట్ గౌన్ ధరించి అందాల విందుకు ఏమాత్రం అడ్డురాకుండా బోర్లా పడుకుంది. ఈ పోజులు చూస్తే కాసేపు ఎవరైనా రెడ్ జోన్ లు.. హైడ్రాక్సీక్లోరోక్విన్లు మర్చిపోయి ఓరకమైన మైకంలో మునిగిపోవడం ఖాయం. బెడ్ రూమ్ లో ఇలాగే ఉంటారు అన్నట్టుగా జుట్టు కూడా కాస్త చిందర వందరగా ఉంది. పాప ఎలా ఉంది అని ఒక్క ముక్కలో చెప్పాలంటే మాసు 'పుష్ప' అక్కడ అదరగొడితే ఇక్కడ గ్లామరస్ పుష్పం ఇక్కడ ఉష్ణోగ్రతలుపెంచుతోంది.

ఇలాంటి ఫోటోలకు వేలల్లో లైక్స్.. లక్షల్లో కామెంట్లు సహజమే కదా. "లాక్ డౌన్ లో వర్క్ ఫ్రమ్ హోమ్?".. "ఐసా మత్ కరోనా".. "రెడ్ హాట్" అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. ఊర్వశి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'వర్జిన్ భానుప్రియ' అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.