Begin typing your search above and press return to search.
గ్లామర్ బ్యూటీ.. విరాళం ఇవ్వడంలో మేటి!
By: Tupaki Desk | 13 May 2020 12:10 PM GMTబాలీవుడ్ నటి ఊర్వశి రూటేలా.. గ్లామర్ పరంగా ఎంత అందాల తారనో.. మంచి మనసు పరంగా అంతకన్నా గొప్పది అని నిరూపించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కరోనా వైరస్ పై పోరాటం సాగించడానికి ఐదు కోట్ల రూపాయాలు విరాళం ప్రకటించి దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది. ఇప్పుడు ఊర్వశి అంటే గ్లామర్ మాత్రమే కాదు హెల్పింగ్ నేచర్ కలిగిన స్టార్. ఇంస్టాగ్రామ్ లో ఊర్వశి 25 మిలియన్ల ఫాలోయింగ్ కలిగి ఉంది. ఆ 25 మిలియన్ల ఫాలోయింగ్ లో 18 మిలియన్ల ఫాలోయర్స్ సహకారంతో ఈ బ్యూటీ ఓ డ్యాన్ క్లాస్ కండక్ట్ చేసింది. తన ఫాలోయర్స్ విరాళాల సహకారంతో ఊర్వశి దాదాపు 5 కోట్ల రూపాయలు విరాళం జమచేసింది. అలా జమ చేయబడిన 5 కోట్లను కరోనా మహమ్మారి పై అలుపెరుగని పోరాటం చేస్తున్న వైద్య సిబ్బంది రక్షణ కోసం విరాళంగా ప్రకటించింది. ఊర్వశి గొప్ప సాయానికి ఫ్యాన్స్ అంతా ఫిదా అవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఊర్వశి మాట్లాడుతూ.. “ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆపద సమయాల్లో సాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. 25 మిలియన్ల ఫాలోవర్స్‌లో 18 మిలియన్ల మంది నేను నిర్వహించిన డ్యాన్స్ తరగతులలో పాల్గొని.. వారి సహకారం అందించారు. నా ఫాలోయర్స్ సహాయంతోనే నేను 5 కోట్ల రూపాయలు జమ చేయగలిగాను. మేము చేసిన ఈ సాయం చిన్నదే అయ్యుండొచ్చు.. కానీ మా ప్రయత్నం మాత్రం వృథా అవ్వలేదు. ఈ మహమ్మారి కరోనా పై పోరాటానికి మనందరి సహాయం అన్నివిధాలా అవసరం. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో సహాయం చేయడానికి ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు” అని ఊర్వశి తెలిపింది. ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఊర్వశి. కన్నడలో ‘మిస్టర్ ఐరావత’ అనే ఒకే ఒక సినిమాలో నటించింది. ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ కే అంకితమై ‘భాగ్ జానీ’ ‘కాబిల్’ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో నర్తించి మెప్పించింది. ఇక హేట్ స్టోరీ, గ్రేట్ గ్రాండ్ మస్తీ.. లలో గ్లామర్ గుప్పించిన ఊర్వశి.. ప్రస్తుతం ‘వర్జిన్ భానుప్రియ’ అనే మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.