Begin typing your search above and press return to search.

ఇంట‌ర్నేష‌న‌ల్ ప్లేబోయ్ తో హేట్ స్టోరి భామ ఫికర్‌

By:  Tupaki Desk   |   3 April 2021 1:30 AM GMT
ఇంట‌ర్నేష‌న‌ల్ ప్లేబోయ్ తో హేట్ స్టోరి భామ ఫికర్‌
X
బాలీవుడ్ అందాల నాయిక ఊర్వ‌శి రౌతేలా గ్లామ‌ర్ షో గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. హేట్ స్టోరి 4 - గ్రేట్ గ్రాండ్ మ‌స్తీ లాంటి చిత్రాల‌తో ఊర్వ‌శి బాలీవుడ్ లో పాపుల‌ర‌య్యారు. త‌న‌దైన‌ గ్లామ‌ర్ షో వేడెక్కించే లిప్ లాక్ లు బాత్ ట‌బ్ షోల‌తో.. బికినీ యాక్టివిటీస్ తో నిరంత‌రం యువ‌త‌రంలో హాట్ టాపిక్ ఈ భామ‌.

తాజా స‌మాచారం మేర‌కు.. ఇంట‌ర్నేష‌న‌ల్ గాయ‌కుడు .. ఈజిప్షియ‌న్ సింగ‌ర్ మొహ‌మ్మద్ ర‌మ‌దాన్ తో క‌లిసి ఊర్వ‌శి ఓ ఇంట‌ర్నేష‌న‌ల్ ఆల్బ‌మ్ లో క‌నిపించ‌నుంది. ఈ సంద‌ర్భంగా ర‌మ‌దాన్ త క‌లిసి ఊర్వ‌శి వీడియో ఆల్బ‌మ్ ని షూట్ చేశారు. దానికి సంబంధించిన‌ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. అంత‌ర్జాతీయ గాయ‌కుడితో త‌న తొలి షోపై ఊర్వ‌శి ఉబ్బిత‌బ్బిబ్బ‌యిపోతోంది.

థాంక్యూ ర‌మ‌దాన్.. మీవ‌ల్ల ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యూజిక్ ఆల్బమ్ లో క‌నిపించ‌బోతున్నాను. ఎక్స్ ట్రా స్పెష‌ల్ ఫ‌ర్ మీ! అంటూ ఊర్వ‌శి కృత‌జ్ఞ‌త‌ల‌తో త‌బ్బిబ్బ‌య్యింది. ఎప్ప‌టికీ ఈ జ్ఞాప‌కాన్ని మర్చిపోలేన‌ని ల‌వ్ బాణాల ఈమోజీల్ని వ‌దిలింది ఊర్వ‌శి.

ఇటీవ‌లే ఫిలింఫేర్ లో త‌ళుకుబెళుకుల‌తో అద‌ర‌గొట్టిన ఊర్వ‌శి మ‌రోవైపు వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీ. ఊర్వ‌శి కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. అటు బాలీవుడ్ లో న‌టిస్తూనే ఇటు టాలీవుడ్ లోనూ రంగ ప్ర‌వేశం చేస్తోంది. టాలీవుడ్ లో ఓ యువ‌త‌రం స్టార్ స‌ర‌స‌నా ఓ మూవీ చేస్తోంది. బ్లాక్ రోజ్ అనే టైటిల్ తో తెలుగులో సినిమా తెర‌కెక్కుతోంది. ర‌ణ‌దీప్ హుడా స‌ర‌స‌న ఇన్ స్పెక్ట‌ర్ అవినాష్ లో న‌టిస్తూ బిజీగా ఉంది.