Begin typing your search above and press return to search.
సాదా సీదా నైట్ డ్రెస్ కు రూ.లక్షనా? ఇదెక్కడి రిచ్ తల్లీ?
By: Tupaki Desk | 6 Jun 2023 6:00 PM GMTచేసిన సినిమాలు.. సాధించిన సక్సెస్ లు తక్కువే అయినా.. వార్తల్లో ఎక్కువగా కనిపించే గ్లామర్ హీరోయిన్లలో బాలీవుడ్ ఘాటు అందంగా అభివర్ణించే హీరోయిన్లలో ఊర్వశీ రౌతేలా ముందుంటారు. ఆమె తీరు.. మాట.. అన్ని ఇస్పెషల్ గా ఉంటాయి. ఇవి సరిపోనట్లు ఆమె చేసే ట్వీట్లు రేపే రచ్చ అంతా ఇంతా కాదు. ఇవన్నీ ఇలా ఉంటే... ఇప్పుడు ఆమె పెడుతున్న ఖర్చులు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
మొన్నీమధ్యన తన పుట్టినరోజు సెలబ్రేషన్స్ కు రూ.93 లక్షలు ఖర్చు చేసిన ఆమె.. తాజాగా హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన సందర్భంగా ఆమె ధరించిన నైట్ డ్రెస్ ధర ఇప్పుడు అందరిని అవాక్కుఅయ్యేలా చేస్తోంది. ఎలాంటి ప్రత్యేకత లేకుండా.. సాదాసీదాగా ఉన్న నైట్ డ్రెస్ విలువ రూ.లక్ష వరకు ఉండటంతో ఇదేం ఖర్చు తల్లీ అంటూ షాక్ తింటున్నారు.
ఈ మధ్యనే బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ పొదుపు గురించి అందరూ ఆసక్తిగా మాట్లాడుకోవటమే కాదు.. హీరోయిన్ ఆలోచనలు ఇలా ఉంటే ఎంత బాగుండన్న మాట వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తన తల్లి కమ్ ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ అమృతా సింగ్ టవల్ కోసం పెట్టే ఖర్చు గురించి ఆగ్రహం వ్యక్తం చేయటం తెలిసిందే. ఒక టవల్ కోసం రూ.1600 ఖర్చు చేయటంలో అర్థం లేదన్న సారా మాటలకు అందరు అవుననే పరిస్థితి.
ఇదే సమయంలో ఊర్వశి ఒక సాదాసీదా నైట్ డ్రెస్ కోసం రూ.91 వేలు ఖర్చు పెట్టిన వైనానికి అవాక్కు అవుతున్నారు. ఇంత సింఫుల్ డ్రెస్ కోసం రూ.లక్ష ఖర్చు పెట్టవా? నువ్వు మామూలుదానికి కావు.. మీరు డబ్బున్నోళ్లు మేడమ్ అంటూ నెటిజన్లు ఒక రేంజ్ లో కామెంట్లు చేస్తున్నారు. ఖర్చు చేయటం తప్పేం కాదు.. దానికో లెక్క ఉండాలన్న విషయాన్ని మర్చిపోతున్న ఊర్వశీ రానున్న రోజుల్లో ఇంకెన్ని సిత్రాల్ని చూపిస్తుందో?