Begin typing your search above and press return to search.

ఇలాంటి బికినీ వ‌ద్దు మొర్రో అన్న నాటీ!

By:  Tupaki Desk   |   13 April 2020 9:10 AM GMT
ఇలాంటి బికినీ వ‌ద్దు మొర్రో అన్న నాటీ!
X
ఊర్వ‌శి రౌతేలా.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు ఇది. అటు బాలీవుడ్ లో ఇప్ప‌టికే ఈ హాటీ పేరు మార్మోగుతోంది. ఇటు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనూ ఈ పేరు ఇటీవ‌ల వినిపిస్తోంది. టాప్ మోడ‌ల్ కం టీవీ న‌టిగా సుప‌రిచిత‌మైన ఈ క్యాట్ వాక్ బ్యూటీ వెండితెర‌ క‌థానాయిక‌గా ఎదిగేందుకు చేయాల్సిన అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. బాలీవుడ్ లో టాప్ స్టార్ల దృష్టిని ఆక‌ర్షించేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తోంది. ప‌నిలో ప‌నిగా సౌత్ లో ఆఫ‌ర్ల కోసం రెగ్యుల‌ర్ ఫోటోషూట్ల‌తో సోష‌ల్ మీడియాల్ని హీటెక్కిస్తోంది.

తాజాగా ఊర్వ‌శి రౌతేలా అదిరిపోయే బికినీ లుక్ ని ఇన్ స్టాలో షేర్ చేసింది. బ్లాక్ బికినీలో ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ఫోజులిస్తూ కుర్ర‌కారు గుండెల్ని ట‌చ్ చేసింది. బ్యాక్ లెస్ స్ట్రిప్డ్ బికినీని చూడ‌గానే కుర్రాళ్ల‌కు షాక్ తిన్నారు మ‌రి. ``బ్యాడ్ వైబ్స్ .. డోంట్ గో విత్ మై ఔట్ ఫిట్`` అంటూ ఈ ఔట్ ఫిట్ పై కావాల్సినంత‌ ప్ర‌చారం చేస్తోంది. ప్ర‌ముఖ బ్రాండ్ లోదుస్తుల‌కు ఇలా తెలివిగా ప్ర‌చారం చేసేస్తోంది ఊర్వ‌శి. అయితే అస‌లు ఈ త‌ర‌హా దుస్తుల్ని తొడ‌గొద్దు ప్లీజ్! అని అంటోంది అంటే.. అంత‌గా బ్యాడ్ వైబ్స్ ఏమిటో త‌నే చెప్పాల్సి ఉంటుంది. బ‌హుశా ఆ బికినీ లో అంత హాట్ గా క‌నిపిస్తున్న త‌న‌కు బోయ్స్ నుంచి బ్యాడ్ మెసేజెస్ వ‌స్తున్నాయేమో త‌న‌నే క‌నుక్కోవాలి మ‌రి.

ఊర్వ‌శి రౌతేలా తెలుగు లోనూ ఓ సినిమాకి క‌మిటైంద‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మ‌వుతోంది. అగ్ర క‌థానాయ‌కుడి నుంచి ఆఫ‌ర్ వ‌చ్చింద‌న్న గుస‌గుస‌లు వినిపించాయి. అయితే ఏదీ ఇంకా అధికారికంగా క‌న్ఫామ్ కాలేదు. మ‌రీ ఇంత‌గా అంత‌ర్జాలంలో విరుచుకుప‌డుతుంటే అవ‌కాశం ఇవ్వ‌కుండా ఉండ‌గ‌ల‌రా? అంత‌గా ఆగేది ఎలా? బాలీవుడ్ లో గ్రేట్ గ్రాండ్ మ‌స్తీ.. హేట్ స్టోరి 4 చిత్రాల‌తో చ‌క్క‌ని గుర్తింపు తెచ్చుకుని సౌత్ లోనూ వెల‌గాల‌ని క‌ల‌లు కంటోంది. మ‌రి ఆ క‌ల‌లు నిజం అవుతాయా లేదా.. కాస్త వేచి చూడాలి.