Begin typing your search above and press return to search.
చిరుతో చెయ్యడమే కల అంటున్న హాటీ
By: Tupaki Desk | 26 July 2016 5:11 AM GMTఉత్తరాది భామ ఊర్వశి రౌతేలా కన్ను టాలీవుడ్ పడింది. ఇక్కడి సినిమాల్లో నటించడమే తన టార్గెట్ అని చెప్పేందుకు కూడా సందేహించడం లేదు. రీసెంట్ గా సైమా అవార్డు ఫంక్షన్ లో అయితే.. తాను జీవితాంతం గుర్తుంచుకునే సందర్భం ఒకటి వచ్చిందని చెబుతోంది ఊర్వశి.
సైమాలో ఈమె ఓ పాటకు డ్యాన్స్ వేస్తే.. మొదటి వరుసలో కూర్చున్న మెగాస్టార్ తెగ చప్పట్లు కొట్టారు. 'ఇది నాకు చాలా అంటే చాలా ప్రత్యేకమైన క్షణం. చిరంజీవి నా డ్యాన్స్ కు చప్పట్లు కొట్టారు. ఆయనతో యాక్ట్ చేయడం అనేది నా కల' అంటూ మనసులో మాట చెప్పేసింది ఊర్వశి రౌతేలా. ప్రస్తుతం ఓ ఫ్యాషన్ షో కోసం హైద్రాబాద్ వచ్చిన ఊర్వశి.. టాలీవుడ్ లో యాక్టింగ్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. 'టాలీవుడ్ లో ప్రతీ ఒక్కరు ఎంతో కష్టపడతారు, ప్రొఫెషనల్ గా ఉంటారు. నాకు ఆఫర్ వస్తే, కచ్చితంగా సినిమా చేస్తా' అని చెప్పింది ఊర్వశి రౌతేలా.
దక్షిణాది ప్రజలు ఏ భేషజాలు లేకుండా డౌన్ టు ఎర్త్ ఉంటారు. సైమాలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు అంటూ.. టాలీవుడ్ కి బాగానే గేలం వేసిందీ ఉత్తరాఖండ్ భామ ఊర్వశీ రౌతేలా.