Begin typing your search above and press return to search.

నాజూకు సుంద‌రికి 40 కేజీల `బంగారు` చీర‌!

By:  Tupaki Desk   |   26 Nov 2017 12:42 PM GMT
నాజూకు సుంద‌రికి 40 కేజీల `బంగారు` చీర‌!
X
2015లో భార‌త్ త‌ర‌పున ప్ర‌పంచ సుంద‌రి కిరీటం కోసం పోటీప‌డిన ఊర్వ‌శి రౌతెలా...ఆ త‌ర్వాత బాలీవుడ్, కోలీవుడ్ లోకి అడుగుపెట్టింది. భాగ్ జానీ, హేట్ స్టోరీ 4 వంటి చిత్రాల‌లో న‌టించింది. త్వ‌ర‌లో ఈ మోడ‌ల్ క‌మ్ హీరోయిన్ త‌న కజిన్ పెళ్లికి అటెండ్ అవ్వ‌బోతోంది. ఆ పెళ్లిలో అంద‌రిలా వెళితే ప్ర‌త్యేక‌త ఏముంటుందని భావించి ఓ వెరైటీ ఆలోచ‌న చేసింది. ఆ పెళ్లిలో ధరించేందుకు 55ల‌క్ష‌ల ఖ‌రీదుగ‌ల బంగారు జ‌రీ చీర‌ను ఆర్డ‌ర్ చేసింది. అంతేకాదు, ఆ చీర‌తో పాటు మ‌రో 28 ల‌క్ష‌ల విలువ‌గ‌ల ఆభ‌రాణాలు ఆర్డ‌ర్ చేసింది.

ఊర్వ‌శి సొంత రాష్ట్రం ఉత్త‌రాఖండ్ లో జ‌ర‌గ‌నున్న వివాహ వేడుకు ఊర్వ‌శి హాజ‌రుకాబోతోంది. ఆ సంద‌ర్భంగా ఆమె 40 కేజీల బ‌రువున్న 55 ల‌క్ష‌ల విలువ‌ గ‌ల బంగారు జ‌రీ చీర‌ను ధ‌రించనుంది. వీటికి అద‌నంగా మ‌రో 28 ల‌క్ష‌ల విలువైన ఆభ‌ర‌ణాల‌ను కూడా వేసుకోనుంది. అయితే, ఆ చీర , న‌గ‌ల విలువ సంగ‌తి కాసేపు ప‌క్క‌న‌బెడితే....అంత బ‌రువును ఈ నాజూకు సుంద‌రి భ‌రించ‌గ‌ల‌దా అన్న సందేహం క‌లుగుతోంది. ఆమె బ‌రువులో సగం `బ‌రువు`ను మోస్తూ పెళ్లిలో వ‌డివ‌డిగా అడుగులు వేయ‌కుండా....బుడిబుడి అడుగులు వేయ‌డం మంచిది!