Begin typing your search above and press return to search.

ఊర్వశివో రాక్షశివో బిజినెస్.. టార్గెట్ పెద్దదే!

By:  Tupaki Desk   |   3 Nov 2022 3:07 PM GMT
ఊర్వశివో రాక్షశివో బిజినెస్.. టార్గెట్ పెద్దదే!
X
బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యువ హీరోలలో అల్లు శిరీష్ కూడా మొదటి స్థానంలో ఉంటాడు అని చెప్పవచ్చు. అతనికి బ్యాగ్రౌండ్ గట్టిగానే ఉన్నప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన విజయం దక్కడం లేదు. ఒకవైపు అల్లు అర్జున్ తమ్ముడిగా మరోవైపు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా బ్రాండ్ ఉన్నా సంతృప్తి లేదు.

ఆఫర్లు అయితే బాగానే అందుకుంటున్నాడు. కానీ మార్కెట్ పరంగా మాత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా నెంబర్స్ క్రియేట్ చేయడం లేదు. ఇక రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు అలాగే డిఫరెంట్ ప్రయోగాలు పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు అల్లు శిరీష్ రొమాంటిక్ కామెడీ సినిమాలతో సక్సెస్ అందుకోవాలి అని రెడీ అవుతున్నాడు. ఊర్వశివో రాక్షసివో అనే టైటిల్ తో రాబోతున్న ఈ రొమాంటిక్ మూవీపై వర్గం ఆడియన్స్ లో అయితే ఆసక్తి నెలకొంది.

ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్ కూడా చాలా ఘాటుగా ఉండడంతో సినిమా ఓవర్గం యువతను ఎక్కువగా థియేటర్స్ లోకి రప్పించే అవకాశం ఉంది. అయితే రొమాన్స్ ఎంత ఉన్నా కూడా స్టోరీ లైన్ కంటెంట్ కనెక్ట్ కాకపోతే మళ్లీ మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈ సినిమా ఈ శుక్రవారం మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 420కి పైగా థియేటర్లలో విడుదలవుతోంది.

నైజాం ఏరియాలోనే గీతా డిస్ట్రిబ్యూషన్స్ ఫిలిమ్స్ సొంతంగా 100 పైగా థియేటర్లలో ఈ సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది. ఇక ఈ సినిమా బిజినెస్ ఎంత జరిగింది అని వివరాల్లోకి వెళితే.మ్ తెలుగు రాష్ట్రాల్లోనే 6 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక ఓవర్సీస్ అలాగే మిగతా దేశాల్లో ఏరియాల్లో కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏడు కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం.

ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావాలి అంటే తప్పనిసరిగా 7.50 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు అల్లు శిరీష్ ఈ రేంజ్ లో అయితే కలెక్షన్స్ అందుకున్న దాఖలాలు లేవు. మరి ఈ పెద్ద టార్గెట్ ను పూర్తి చేస్తాడో లేదో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.