Begin typing your search above and press return to search.
ప్రియాంక.. జగమెరిగిన మోసగత్తె!
By: Tupaki Desk | 6 Dec 2018 5:38 AM GMTబాలీవుడ్ తార ప్రియాంక చోప్రా, అంతర్జాతీయ గాయకుడు నిక్ జోనాస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. వివాహ బంధంతో ఒక్కటైన జంటను అందరూ దీవిస్తుంటే, ఓ న్యూయార్క్ మ్యాగజైన్ మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేసింది. ప్రియాంక జగమెరిగిన మోసగత్తె అని, నిక్‌ను ఆమె వంచించి పెండ్లి చేసుకుందంటూ చెత్తంతా వెళ్లగక్కింది. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ముమ్మాటికీ జాతివివక్షతో కూడిన వ్యాఖ్యలేనంటూ నిరసనలు ప్రారంభం కావడంతో ఆ పత్రిక చివరకు క్షమాపణలు చెప్పింది.
ది కట్ మ్యాగజైన్‌కు సంబంధించిన వెబ్ సైట్ లో ప్రియాంక-నిక్జోనాస్లది నిజమైన ప్రేమేనా? అనే శీర్షికతో ఈ కథనం ప్రచురితమైంది. జర్నలిస్ట్ మరియా స్మిత్ రాసిన ఈ కథనంలో అనేక అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయి. ``పాపం నిక్.. అందరు కుర్రాళ్ల లాగే కాలక్షేపానికి కొద్దిరోజులు ప్రేమాయణం సాగించి వదిలేద్దామనుకున్నాడు. కానీ ఆమె జగమెరిగిన మోసగత్తె. కుట్ర పన్ని.. పెండ్లి పేరుతో నిక్‌ను శాశ్వతంగా కట్టేసుకుని, ఆయనకు యావజ్జీవ శిక్షను విధించింది`` అంటూ రాసుకొచ్చింది. ఒక ఆసియా మహిళ అమెరికా సినీ, టీవీ రంగాల్లో రాణించడాన్ని జీర్ణించుకోలేకే ఇలా విషం కక్కుతున్నారని బాలీవుడ్ తారలు సోనమ్‌కపూర్ - స్వరాభాస్కర్ - గాయని సోనా మహాపాత్ర విమర్శించారు. నిక్ జోనాస్ సోదరి జోయ్ జోనాస్, ఆమె ప్రియుడు సోఫీ టర్నర్ కూడా ఈ కథనంపై ఘాటుగా స్పందించారు. ఇలాంటి కథనాన్ని ప్రచురించినందుకు ఆ మ్యాగజైన్ సిగ్గుపడాలి అని వారు మండిపడ్డారు. నిరసనలు తీవ్రమవుతుండటంతో ది కట్ దిగివచ్చింది. ఆ కథనాన్ని తొలగిస్తున్నామని.. క్షమాపణలు చెప్పింది.