Begin typing your search above and press return to search.
నాటు నాటు కొరియోగ్రాఫర్ తో వాల్ స్ట్రీట్ జర్నల్..!
By: Tupaki Desk | 5 March 2023 9:58 AM GMTఆర్.ఆర్.ఆర్ సినిమా ఆస్కార్ ముందు నిలబెట్టిన సాంగ్ నాటు నాటు. 95వ అకాడమీ అవార్డుల్లో ఆ సాంగ్ నామినేట్ అవడం.. దాదాపు 100 ఏళ్ల ఇండియన్ సినిమా కలని నెరవేరుస్తుందని అందరూ భావిస్తున్నారు. ఆస్కార్ ఈవెంట్ లో కూడా నాటు నాటు సాంగ్ లైవ్ పెర్ఫార్మెన్స్ తో పాటుగా ఎన్.టి.ఆర్, రాం చరణ్ తో లైవ్ డాన్స్ కూడా వేస్తారని తెలుస్తుంది.
అయితే ఆర్.ఆర్.ఆర్ హాలీవుడ్ ప్రమోషన్స్ లో ఎక్కువగా డైరెక్టర్ రాజమౌళి, హీరోలు చరణ్, ఎన్.టి.ఆర్ ల గురించే ప్రమోట్ చేస్తున్నారు. కానీ అసలు ఆస్కార్ కి నామినేట్ అయిన నాటు నాటు సాంగ్ కొరియోగ్రాఫర్ ని మర్చిపోయారు.
ప్రముఖ యూఎస్ వార్త పత్రిక ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కంపోజ్ చేసిన ప్రేం రక్షిత్ మాస్టర్ ని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూ గురించి ప్రస్తుతం అందరు చర్చించుకుంటున్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ డైరెక్టర్ రాజమౌళి, హీరోలు ఎన్.టి.ఆర్, చరణ్ లను వదిలిపెట్టి డాన్స్ కంపోజర్ ప్రేం రక్షిత్ ని ఇంటర్వ్యూ చేయడం షాకింగ్ గా ఉంది.
అయితే ఈ సాంగ్ కొరియోగ్రఫీ టైం లో తాను ఎన్నో 100ల కొద్దీ మూమెంట్స్ రెడీ చేసుకున్నానని కానీ రాజమౌళి ఆ స్టెప్ ఒక్కటి ఫైనల్ చేశారని చెప్పారు.
ఈ సాంగ్ తో ఇంటర్నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. సినిమాలో ఇద్దరు హీరోల బాడీ లాంగ్వేజ్, స్టైల్ ని బట్టి డ్యాన్స్ కంపోజ్ చేశానని అన్నారు ప్రేం రక్షిత్. ఆయన సాంగ్ కంపోజ్ చేసే టైం లో కూడా అది ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇంత గుర్తింపు తెచ్చుకుంటుందని ఊహించి ఉండరు. ఫైనల్ గా ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు సాంగ్ తో ఆ కంపోజర్ గురించి కూడా ప్రపంచానికి తెలిసేలా చేసింది వాల్ స్ట్రీట్ జర్నల్.
అంతకుముందు పరిస్థితి ఎలా ఉన్నా ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఇండియన్ సినిమాను హాలీవుడ్ ప్రేక్షకులు చూసే కోణం మారుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆస్కార్ కి అడుగు దూరంలో ఉన్న ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు సాంగ్ అది కూడా తెస్తే ఇండియన్ సినిమాకు ఆరోజు పండుగ వచ్చినట్టే అని చెప్పొచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.