Begin typing your search above and press return to search.
#SSMB28 కోసం అల ఫార్ములాను వాడేస్తున్నాడా?
By: Tupaki Desk | 1 Sep 2022 1:30 AM GMTసూపర్ స్టార్ మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అతడు- ఖలేజా చిత్రాల్లో యాక్షన్ సన్నివేశాలు బెంచ్ మార్క్ సెట్ చేయడమే గాక.. హాలీవుడ్ స్టైల్లో అలరించిన సంగతి తెలిసిందే. ఆడియెన్ ఎంతో ఉత్కంఠగా ఆ సన్నివేశాలను వీక్షించేలా మలిచిన తీరు ఆసక్తికరం. ఇప్పుడు అంతకుమించి హ్యాట్రిక్ మూవీలో యాక్షన్ సీన్లను త్రివిక్రమ్ డిజైన్ చేశారని తెలిసింది. అంతేకాదు..ఈసారి మహేష్ ఫార్మాట్ కి భిన్నంగా త్రివిక్రమ్ ప్లానింగ్ సాగుతోంది. తొలిగా యాక్షన్ సీక్వెన్సులతో సినిమాని ప్రారంభించి వేగంగా వాటిని పూర్తి చేసి అటుపై పాటలు.. చివరిగా టాకీ పూర్తి చేస్తారని ఇది రొటీన్ కి భిన్నంగా సాగే ప్రక్రియ అని టాక్ కూడా వినిపిస్తోంది.
సాధారణంగా మహేష్ టాకీ తో మొదలు పెట్టి పాటలు పూర్తి చేసి చివరిగా యాక్షన్ ఎపిసోడ్స్ పూర్తి చేస్తారు. కానీ దానికి భిన్నంగా ఈసారి రివర్సులో ప్రతిదీ ప్లాన్ చేసారని సమాచారం. ఈ ప్లాన్ ఛేంజ్ వెనక అసలు లాజిక్ ఏమిటన్నది త్రివిక్రమ్ చెబుతారేమో చూడాలి.
నిజానికి ఈపాటికే #SSMB28 ప్రారంభం కావాల్సి ఉంది. కానీ రెండు సార్లు వాయిదా పడింది. ఇప్పటికే ఏప్రిల్ 2023 విడుదల తేదీని ప్రకటించేశారు.. అంటే డెడ్ లైన్ ప్రకారం పూర్తి చేస్తేనే అప్పటికి రిలీజ్ చేయడం సాధ్యమవుతుంది. తాజా సమాచారం మేరకు మహేష్ సెప్టెంబర్ 8 నుండి సెట్స్‌పైకి వెళ్లనున్నాడు. మొదట అన్ని యాక్షన్ ఎపిసోడ్ లను చిత్రీకరిస్తారు. 20 రోజులు పైగా ఈ షెడ్యూల్ జరుగుతుంది. ఆసక్తికరంగా యాక్షన్ షెడ్యూల్ తో పూజా హెగ్డేకి పని లేదు. అందువల్ల రెండో షెడ్యూల్ నుంచి చిత్రీకరణలో పాల్గొంటుందని సమాచారం.
త్రివిక్రమ్ ఇంతకుముందు `అల వైకుంఠపురములో` కోసం ఇదే పంథాలో ఫార్ములా మార్చి తెరకెక్కించారు. సెంటిమెంటల్ గా అది బాగా వర్కవుటైంది. ఎన్టీఆర్ `అరవింద సమేత` కోసం త్రివిక్రమ్ అదే విధానాన్ని ఉపయోగించారు. తొలి రోజు తొలి షెడ్యూల్ లో కీలక ఫైట్ సన్నివేశాలను చిత్రీకరించాడు.
ఇప్పుడు మహేష్ బాబు సినిమాకి కూడా అదే యాక్షన్ సన్నివేశాలతో సినిమాని ప్రారంభిస్తుండడం ఆసక్తికరం. స్టంట్స్ కోసం మహేష్ ఇప్పటికే రూపం మార్చుకున్నాడు. జిమ్ లో భారీ కసరత్తులు చేసి బాడీని పెంచారు. ప్రధాన పోరాట సన్నివేశాలు పూర్తయిన తర్వాత చిత్రబృందం హాస్య విభాగాలపై దృష్టి పెడుతుంది. రాధా కృష్ణ ఎస్ ఈ చిత్రానికి నిర్మాత.
నమ్రత శిరోద్కర్ తన భర్త మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ జోడీ ఆన్ లొకేషన్ ఉన్న ఫోటోలను ఇంతకుముందు షేర్ చేయగా వైరల్ అయ్యాయి. సెలబ్రిటీ పింక్ బ్లౌజ్ - గ్రే బిజినెస్ సూట్ ధరించి మహేష్ కనిపించారు ఆ ఫోటోలో. షూట్ డే!! అని ఆమె స్టిల్ కి క్యాప్షన్ రాసారు. నిజానికి ఇది SSMB28 కోసం కాదు.. ఒక వాణిజ్య ప్రకటన కోసం చిత్రీకరించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.