Begin typing your search above and press return to search.
లేడీస్ నైటీస్ మీద ఉత్తేజ్ కామెంట్స్
By: Tupaki Desk | 25 Nov 2016 9:30 AM GMTకొన్ని విషయాల గురించి అందరికి అడగాలని ఉంటుంది.. కానీ వాటి గురించి ప్రశ్నిస్తే లేనిపోని చిక్కులు ఎక్కడొచ్చి పడతాయేనని ఎవరికివారు సైలెంట్ గా ఉండిపోతారు. కానీ కేరెక్టర్ ఆర్టిస్ట్ ఉత్తేజ్ మాత్రం అలా సైలెంట్ గా ఉండలేకపోయాడు. మీరు చేస్తోన్న పనులు ఎంతవరకు కరెక్టో ఓ సారి ఆలోచించండి అని మహిళలకి సలహా ఇచ్చాడు.
ఎంతకీ ఉత్తేజ్ ఏ టాపిక్ మీద అంత సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు అంటే నైటీలు వేసుకునే లేడీస్ గురించి. అవును నైటీల మీదే. కొంతమంది మహిళలు రాత్రుళ్లు వేసుకోవాల్సిన నైటీల్ని అక్కడితో ఆపరని.. పొద్దునే లేచి వాటి మీదే తిరుగుతుంటారని.. ఇంకొంతమందైతే ఏకంగా నైటీల మీద డ్రైవింగ్ చేసేస్తుంటారని ఇది ఎంత వరకు కరెక్టని ప్రశ్నించాడు. ఇందులో అభ్యంతరం... జాగ్రత్తా రెండూ ఉన్నాయన్నాడు. అలాగే కొందరు మహిళలు పొద్దస్తమానం ఫోన్లలో మాట్లాడుతూ గడిపేస్తూ పిల్లల్ని ఫోన్లు పట్టుకోవద్దు అంటే వాళ్లెందుకు మాట వింటారని.. మరి కొందరేమో పిల్లల చేతికి ఫోన్స్ ఇచ్చేస్తుంటారని ఇలాంటివి అవసరమా అంటున్నాడు.
రైటర్ కమ్ కమెడియిన్ కమ్ కేరెక్టర్ ఆర్టిస్ట్ అంటూ సినీ రంగంలోని అన్ని విభాగాల మీద పట్టున్న ఉత్తేజ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఈ సెన్సిటివ్ పాయింట్స్ మీద నిర్మోహమాటంగా తన అభిప్రాయాన్ని చెప్పేశాడు. ఎంతమందిని అబ్జర్స్ చేసి చెప్పాడో గానీ ఉత్తేజ్ చెప్పింది నిజమే. అయితే ఇప్పుడు ఆ సలహాల్ని స్వీకరించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారన్నదే అసలు విషయం. పైగా ఆడవారి విషయాలు మాట్లాడి రీసెంట్ గా కొంతమంది ఆర్టిస్ట్ లు చిక్కుల్లో పడ్డారు. ఇలాంటి టైంలో ఈ సలహాలు ఇవ్వడం అవసరమా ఉత్తేజ్ అంటున్నారు కొందరు. చూడాలి మరి ఉత్తేజ్ మాటల మీద రియాక్షన్ ఎలా ఉండబోతుందో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/