Begin typing your search above and press return to search.

ఉత్తేజ్ భార్య మృతి.. ఓదార్పులో అన్న‌య్య‌ చిరంజీవి..!

By:  Tupaki Desk   |   13 Sep 2021 5:52 AM GMT
ఉత్తేజ్ భార్య మృతి.. ఓదార్పులో అన్న‌య్య‌ చిరంజీవి..!
X
టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ భార్య పద్మావతి సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆమెకు కొన్ని సంవత్సరాల క్రితం క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇటీవల కాలంలో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో చేరారు. చికిత్స పొందుతూ ఆమె ఆసుపత్రిలో మరణించారు.

పద్మ మరణవార్త తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి - ప్రకాష్ రాజ్- బ్రహ్మాజీ- జీవిత ఇతర టాలీవుడ్ నటులు ఉత్తేజ్ ఇంటికి చేరుకున్నారు. చిరంజీవి త‌న‌కు సోద‌రుడిగా భావించే ఉత్తేజ్ ని ఓదార్చారు. ఉత్తేజ్ ని అతని కుమార్తెను ఓదారుస్తూ చిరు త‌న విచారాన్ని వ్య‌క్తం చేశారు. ఉత్తేజ్ తన భార్య మరణంతో తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు.

టాలీవుడ్ లో సీనియ‌ర్ న‌టుడిగా ర‌చ‌యిత‌గా అసాధార‌ణ ప్ర‌తిభావంతుడిగా ఉత్తేజ్ సుప‌రిచితం. ఉత్తేజ్ తెలుగు చిత్రాలలో సుదీర్ఘ కాలం న‌టించిన గొప్ప పెర్ఫామ‌ర్. ర‌చ‌యిత‌గా సహాయ దర్శకుడిగానూ ప‌ని చేశారు. ముఖ్యంగా అత‌డు మెగా వీరాభిమాని. చిరును అన్న‌య్యా అని పిలుస్తారు. ఆయన తెలంగాణలోని నల్గొండలో జన్మించారు. అతిఎక్స్ ప్రెషన్ లు లేకుండా నటించే అతికొద్ది సహజ కళాకారులలో ఆయన ఒకరు. ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 1989 లో `శివ` సినిమా ద్వారా సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున - అమల అక్కినేని ప్రధాన పాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీతం అందించారు. చక్రవర్తి ఆ సినిమాలో విల‌న్ గా న‌టించారు. ఇందులో ఉత్తేజ్ కి చిన్న పాత్రలో క‌నిపిస్తారు. అనంత‌ర కాలంలో కృష్ణ వంశీ ఉత్తేజ్ ని ప్రేరేపించాడు. అతని కెరీర్ ను మెరుగుపరుచుకోవడానికి అతనికి చాలా అవకాశాలు కల్పించాడు. ఉత్తేజ్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ .. కమెడియన్.. అతను తెలుగు ప్రేక్షకుల హృదయాలలో నిలిచారంటే అతని సహజ ప్రదర్శన దానికి కార‌ణం.

ఉత్తేజ్ ఆంధ్ర ప్రభుత్వం నుండి నంది అవార్డును అందుకున్న మేటి న‌టుడు. చందమామ చిత్రంలో హాస్యనటుడిగా నటించినందుకు ఆయనకు అవార్డుతో సత్కరించారు. ఆయన కృష్ణ వంశీతో కలిసి గులాబీ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు. శివ- రాత్- ద్రోహి -గోవింద గోవింద అతని సహాయక దర్శకుడిగా పనిచేసిన కొన్ని చిత్రాలు. అతను 1996 సంవత్సరంలో నిన్నే పెళ్లాడతా అనే చిత్రానికి సంభాషణలు కూడా రాసాడు. ఈ చిత్రం అతడిని డైలాగ్ రైటింగ్ లో కూడా తన ప్రతిభను చూపించేలా చేసింది. ఉత్తేజ్ నిన్నే పెళ్లాడతా చిత్రం అదనపు భాగాలకు సంభాషణలు రాశాడు. మెగా కాంపౌండ్ స‌హా కృష్ణ‌వంశీ- ఆర్జీవీ- పూరి కాంపౌండ్ ల‌కు అత్యంత ప్రీతిపాత్రుడైన ఉత్తేజ్ కు సినీరంగంలో అగ్ర హీరోలంతా అవ‌కాశాలిచ్చారు. మొత్తం సినిమా కోసం కాదు. ఆయన కుమార్తె చేతన కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎదిగారు. ఇప్పుడు క‌థానాయిక‌గానూ న‌టిస్తున్నారు. తెలుగు చిత్రాలలో నాయిక‌గా కొన‌సాగుతోంది.

ఉత్తేజ్‌ చేసే సేవా కార్యక్రమాల్లో పద్మావతి భాగస్వామి అయ్యేవారు. సామాజిక సేవ‌తో పాటు వృత్తిప‌ర శిక్ష‌ణ‌లోనూ ఆమె భాగం. ఉత్తేజ్ కు చెందిన మయూఖ టాకీస్‌ ఫిల్మ్‌ యాక్టింగ్‌ స్కూల్‌ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్‌ ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉత్తేజ్ ని క‌లిసేందుకు కొద్ది సేప‌టి క్రితం రాజశేఖ‌ర్ కూడా హాజ‌ర‌య్యారు.