Begin typing your search above and press return to search.

యూవీ క్రియేషన్స్ వారి కార్తికేయ మూవీకి అసలేం అయ్యింది?

By:  Tupaki Desk   |   4 Dec 2022 12:30 AM GMT
యూవీ క్రియేషన్స్ వారి కార్తికేయ మూవీకి అసలేం అయ్యింది?
X
ఆర్‌ఎక్స్ 100 సినిమా తో హీరోగా మంచి పేరు దక్కించుకున్న కార్తికేయ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. సినిమా సినిమాకి నటుడిగా మంచి పేరును దక్కించుకుంటున్నాడు.. కానీ కమర్షియల్‌ హిట్స్ మాత్రం కార్తికేయకు పడటం లేదు. ఒక వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు విలన్ పాత్రలు చేస్తున్న విషయం తెల్సిందే.

ప్రస్తుతం యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ లో కార్తికేయ సినిమా రూపొందుతోంది. ఆ మధ్య ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. మళ్లీ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్‌ అయితే ఇవ్వలేదు. ప్రశాంత్‌ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ లో రూపొందుతున్న ఈ సినిమా ను నేరుగా ఓటీటీ లో విడుదల చేసే విషయమై ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

సినిమా షూటింగ్ ఎక్కడ వరకు వచ్చింది.. విడుదల ఎప్పుడు అనే విషయం గురించి యూవీ క్రియేషన్స్‌ వారిని సంప్రదించినా కూడా సరైన సమాధానం అయితే లభించడం లేదు అంటూ మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఔట్‌ పుట్‌ చాలా బాగా వచ్చిందట.

సినిమా ఔట్‌ పుట్‌ విషయంలో యూనిట్‌ సభ్యులు చాలా పాజిటివ్ గా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. కానీ రిలీజ్ విషయంలో మాత్రం యూవీ క్రియేషన్స్‌ వారు థియేట్రికల్‌ రిలీజ్ ను స్కిప్‌ చేసే యోచనలో ఉన్నారు అంటూ లీక్ అందుతోంది.

థియేట్రికల్‌ రిలీజ్‌ చేయాలి అనుకుంటే యూవీ క్రియేషన్స్‌ వారు తమకు ఉన్న నెట్‌ వర్క్‌ తో భారీగా విడుదల చేయగలరు.. కానీ ఓటీటీ వైపే వారు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.

కార్తికేయ గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. అందుకే ఈ సినిమా పై ఆయన మరియు ఆయన యొక్క అభిమానులు ఆశలు పెట్టుకుని ఉన్నారు. కానీ సినిమాను మాత్రం యూవీ క్రియేషన్స్‌ వారు ఇప్పట్లో విడుదల చేసేలా కనిపించడం లేదు.. విడుదల చేసినా ఓటీటీ ద్వారా వస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలంటే మరి కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.