Begin typing your search above and press return to search.
వెనకాడేది లేదంటున్న యూవీ నిర్మాతలు
By: Tupaki Desk | 26 Jan 2020 11:42 AM GMTసాహో' చిత్రాన్ని భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ లో వంశీ మరియు ప్రమోద్ లు నిర్మించిన విషయం తెల్సిందే. సాహోకు భారీగా వసూళ్లు నమోదు అయ్యాయి. అయినా కూడా సినిమా బడ్జెట్ భారీగా పెట్టడం వల్ల నిర్మాతలు మరియు బయ్యర్లకు స్వల్ప నష్టాలు తప్పలేదు అంటూ ట్రేడ్ విశ్లేషకులు చెప్పారు. సాహో అనుభవంతో ప్రభాస్ ప్రస్తుత సినిమా జాన్ బడ్జెట్ విషయంలో యూవీ క్రియేషన్స్ నిర్మాతలు కాస్త జాగ్రత్త పడుతున్నట్లుగా ప్రచారం జరిగింది.
తాజాగా జాన్ బడ్జెట్ విషయంలో యూవీ క్రియేషన్స్ నిర్మాతలు చాలా నమ్మకంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే భారీ బడ్జెట్ ను ఈ చిత్రం కోసం పెట్టడం జరిగిందట. ఇంకా కూడా ఏమాత్రం వెనుకంజ వేయకుండా క్వాలిటీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తామని వారు చెబుతున్నారు. సినిమాపై అంచనాలు భారీగా ఉన్న కారణంగా ఏమాత్రం బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా నిర్మిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. సాహోలా కాకుండా ఈసారి పూర్తి స్థాయిలో ప్రేక్షకులకు మరియు అభిమానులకు సంతృప్తి కలిగేలా జాన్ సినిమా ఉంటుందంటూ నిర్మాతలు ధీమాగా చెబుతున్నారు.
స్టైలిష్ దర్శకుడిగా పేరు దక్కించుకున్న రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ప్రభాస్ కు జోడీగా ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పీరియాడిక్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం కథ ఎక్కువగా 1980 నేపథ్యంలో అది కూడా ఇటలీలో ఉంటుందని సమాచారం అందుతోంది. ఈ చిత్రం విడుదల విషయంలో అతి త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.