Begin typing your search above and press return to search.

'సైరా' కు ఝ‌ల‌క్.. హైకోర్టుకు పంచాయితీ

By:  Tupaki Desk   |   23 Sep 2019 12:41 PM GMT
సైరా కు ఝ‌ల‌క్.. హైకోర్టుకు పంచాయితీ
X
సెన్సార్ పూర్త‌వ్వ‌డం అంటే అర్థం ఏమిటి? సినిమా రిలీజ్ కి అన్ని అడ్డంకులు తొల‌గిపోయాయ‌నే క‌దా? కానీ ఈ కోర్టు లొల్లేంటి? మెగా మూవీ సైరా-న‌ర‌సింహారెడ్డి అక్టోబ‌ర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతోంది. సెన్సార్ బృందం యుఏ స‌ర్టిఫికెట్ జారీ చేసి 2గంట‌ల 44నిమిషాల నిడివిని డిక్లేర్ చేశారు.

కానీ ఇంకా `సైరా`ను వివాదాలు వ‌దల్లేదు. సినిమా విడుదల కాకుండా ఆపాలని హైకోర్టు లో తాజాగా పిటిషన్ దాఖలు చేయ‌డం సంచ‌ల‌న‌మైంది. గ‌త కొంత‌కాలంగా కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీతో ఉయ్యాలవాడ వారసులు త‌మ హ‌క్కుల విష‌య‌మై పోరాటం సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే తెలంగాణ హైకోర్టులో వీరు పిటీష‌న్ వేసారు. చిరంజీవి - రామ్ చరణ్ త‌మ‌కు న్యాయం చేయ‌కుండా తీవ్ర‌ ఇబ్బందులకు గురి చేస్తున్నార‌ని ఆ పిర్యాదులో పేర్కొన్నారు.

ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి కథను త‌మ వ‌ద్ద నుంచి తీసుకొని మోసం చేశార‌ని .. చిరంజీవి.. రామ్ చరణ్ హామీ ఇచ్చి మాట తప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయం కోసం పోరాటం చేస్తే తమపైనే అక్రమ కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని.. న్యాయం ద‌క్కే వరకు సైరా నర్సింహారెడ్డి సినిమాను విడుదల చేయొద్దంటూ పిటిషన్ లో ఉయ్యాలవాడ వారసులు పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం నాడు తెలంగాణ హైకోర్ట్ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది.