Begin typing your search above and press return to search.
ఔరా!! మా కథకు ఈ టైటిల్ ఏంది??
By: Tupaki Desk | 22 Aug 2017 1:29 PM GMTమెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా గురించి ఎట్టకేలకు ఒకే రోజున అన్నీ ఓపెన్ అయిపోయాయ్. ఈ సినిమాలో మెగాస్టార్ తో ఎవరు నటిస్తారు.. సినిమాకు ఏ సాంకేతిక నిపుణుడు పనిచేస్తున్నాడు.. అలాగే ఈ సినిమా టైటిల్ తో సహా అన్నీ ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా టైటిల్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫ్యామిలీకి నచ్చలేదంటూ ఒక టాక్ వస్తోంది.
నిజానికి ఈ సినిమాకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే టైటిల్ పెడతారని అందరూ అనుకున్నారు. కాని అది వర్కవుట్ కాలేదు. ఎందుకంటే సినిమాకు యునివర్సల్ అపీల్ కావాలి కాబట్టి.. అన్ని బాషల్లోనూ ఒకటే టైటిల్ ఉంటే 'బాహుబలి' వర్కవుట్ అయినట్లు కమర్షియల్ యాంగిల్ బాగా వర్కవుట్ అవుతుంది కాబట్టి.. బాగా ఆలోచించి మనోళ్ళు 'సై రా' అనే టైటిల్ పెట్టారు. అయితే ఈ టైటిల్లో తమ కుటుంబీకుడు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును ఎందుకు పెట్టలేదని ఆయన చుట్టాలు ఫీలవుతున్నారు. అంతే కాదు.. అసలు ఉయ్యాలవాడ టైటిల్ పెట్టకపోతే మాత్రం కేసును కూడా పెడతాం అంటున్నారు. ముందుగా వారు చిరంజీవిని కలసి లేదంటే రామ్ చరణ్‌తో ములాఖాత్ తీసుకుని.. అప్పుడు ఏ విషయం ఆలోచిస్తారటలే.
అయితే ఇక్కడ తెలుగులో ఈ సినిమాకు ఉయ్యాలవాడ అని తగిలిస్తే.. మరి ఇతర బాషల్లో ఆ టైటిల్ తాలూకు కిక్ పోతుంది. చూద్దాం అసలు ఈ యవ్వారం ఎలా టర్నింగ్ తీసుకుంటుందో.