Begin typing your search above and press return to search.
చిరును భారీగా కలిసిన ఉయ్యాలవాడ వంశీకులు
By: Tupaki Desk | 25 Sep 2019 4:54 AM GMTసైరా సంరంభం మొదలైంది. ఇదిలా ఉంటే.. మరోవైపు ఈ సినిమాకు కీలకమైన ఉయ్యాలవాడ వంశీకులు చిరంజీవి తమను మోసం చేశారంటూ రోడ్డెక్కటం.. నిరసనలు వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. ఇలాంటివేళ.. ఉయ్యాలవాడ వంశీకులు పలువురు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం రూపనగుడి గ్రామానికి చెందిన నరసింహారెడ్డి వంశస్థులు చిరంజీవిని హైదరాబాద్ లోని ఆయన ఇంట్లో కలిశారు.
ఉయ్యాలవాడ వంశీకులు పెద్దఎత్తున ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తమ వంశస్థుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరగాథను సైరా నరసింహారెడ్డి పేరుతో సినిమా తీసి.. రేనాటి గడ్డ ప్రతిష్ఠను నిలిపినందుకు ఉయ్యాలవాడ వంశీకులు చిరుకు థ్యాంక్స్ చెప్పారు.
ఈ సందర్భంగా చిరును ఉయ్యాలవాడ వంశీకులు ఒక వినతి చేశారు. కోవెలకుంట్లలోని జుర్రేరు.. కుందూ నదులు కలిసే ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్మతి వనాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని కోరగా.. అందుకు చిరు ఓకే చెప్పినట్లు చెబుతున్నారు. ఓవైపు ఉయ్యాల వంశీకులు చిరు తమను మోసం చేశారని ఆరోపిస్తుంటే.. మరికొందరు మాత్రం ఆయన్ను కలిసి.. తమ వద్దకు రావాలని కోరటం గమనార్హం.