Begin typing your search above and press return to search.

ఉయ్యాలవాడ లోగో రెడీ..?

By:  Tupaki Desk   |   14 Aug 2017 3:27 PM GMT
ఉయ్యాలవాడ లోగో రెడీ..?
X
‘ఖైదీ నంబర్ 150’తో ఘనంగా రీఎంట్రీ ఇచ్చేశాడు మెగాస్టార్ చిరంజీవి. ఐతే ఆ సినిమా విడుదలై ఏడు నెలలు దాటుతున్నా చిరు తర్వాతి సినిమా మొదలు కాలేదు. చిరు తర్వాతి సినిమాగా‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కన్ఫమ్ అయింది కానీ.. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందన్నది క్లారిటీ లేదు. వేసవికే ప్రారంభోత్సవం అన్నారు కానీ.. అలా జరగలేదు. తర్వాత చిరంజీవి పుట్టిన రోజున కొబ్బరికాయ కొడతారని గట్టి ప్రచారమే జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 22కు కూడా సినిమా పట్టాలెక్కేలా లేదు. ప్రి ప్రొడక్షన్ వర్క్ మరింత ఆలస్యమవుతుండటంతో ప్రారంభోత్సవానికి ఇంకా సమయం పట్టే అవకాశముంది.

ఐతే చిరు పుట్టిన రోజుకు ‘ఉయ్యాలవాడ..’ విశేషాలేమీ లేకుంటే అభిమానులు నిరాశకు గురవుతారని భావించి.. వాళ్ల కోసం ఓ కానుకను సిద్ధం చేసినట్లు సమాచారం. 22న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ లోగోను లాంచ్ చేస్తారని తెలిసింది. ఇప్పటికే ఓ పవర్ ఫుల్ లోగో రెడీ అయినట్లు సమాచారం. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రాన్ని చిరు తనయుడు రామ్ చరణే నిర్మించనున్న సంగతి తెలిసిందే. స్క్రిప్ట్ రెడీ అయినప్పటికీ ప్రి ప్రొడక్షన్ పనులు ఆలస్యమవుతున్నాయి. ఇంకో రెండు నెలల తర్వాత కానీ సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ చిత్రానికి సంగీతాన్నందించేందుకు ఎ.ఆర్.రెహమాన్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ.. తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో పేరున్న టెక్నీషియన్లనే తీసుకుంటున్నారు. ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడిగా రవి వర్మన్ ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. రాజీవన్ ఆర్ట్ డైరెక్షన్ చేయనున్నాడు.