Begin typing your search above and press return to search.
వర్మకు సిగ్గు లేదన్న హనుమంతన్న!
By: Tupaki Desk | 24 Aug 2017 3:33 PM ISTప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు వివాదాలేం కొత్త కాదు. ఆయనపై పలువురు పలు సందర్భాల్లో మండిపడటం మామూలే. ఆయన మాటలు.. సోషల్ మీడియాలో ఆయన రియాక్ట్ అయ్యే తీరుపై ఇప్పటికే పలుమార్లు వివాదాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల కాలంలో హాట్ హాట్ ముద్దు సీన్ తో వచ్చిన అర్జున్ రెడ్డి మూవీ పోస్టర్ పై తెలంగాణ కాంగ్రెస్ నేత వీహెచ్ హనుమంతరావుకు ఆగ్రహం రావటం.. కారులో వెళుతున్న వాడు సైతం.. రోడ్డు మీదకు దిగి ఆ పోస్టర్ ను చించేయటం తెలిసిందే.
ఈ వ్యవహారం రామ్ గోపాల్ వర్మ విమర్శలు చేశారు. దీనిపై హనుమంతన్న తాజాగా రియాక్ట్ అయ్యారు. వర్మ లాంటి దర్శకుడి వల్లే సినిమా పరిశ్రమ పాడవుతుందన్న ఆయన.. తాజాగా సెన్సార్ బోర్డు ఆఫీసు ఎదుట ఆందోళన నిర్వహించారు. సమాజంలో హింసను ప్రోత్సహించేలా సినిమాలు తీస్తుంటే సెన్సార్ బోర్డు ఏం చేస్తుందంటూ మండిపడ్డారు.
రాంగోపాల్ వర్మకు అస్సలు సిగ్గు లేదని.. ఆయన లాంటి వారి వల్లే సినీ ఇండస్ట్రీ చెడిపోతుందని.. ఇకపై సినిమాల్లో నేరుగా రేప్ సీన్లు కూడా పెడతారేమోనని ఆయన వ్యంగ్యంగా విమర్శించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా వీహెచ్ కు సినిమాల్లో హింస కనిపించటం ఏమిటన్నది పెద్ద ప్రశ్నగా మారింది. గతంలో సినిమాల మీద ఆయన ఇంతగా చెలరేగిపోయింది లేదు. తాజాగా.. సినిమాల్లో శృంగారం.. హింసపై ఆయన గళం పెంచుతున్నారు. తనను తప్పు పడుతున్న వర్మ లాంటి వారిపై ఆయన తీవ్రంగా మండిపడుతున్న వైఖరి ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.