Begin typing your search above and press return to search.
ఓటీటీ ప్లాప్ మూవీని మళ్ళీ థియేటర్స్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారా..?
By: Tupaki Desk | 30 Nov 2020 11:30 PM GMTనేచురల్ స్టార్ నాని - సుధీర్ బాబు కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ''వి''. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ - హర్షిత్ రెడ్డి నిర్మించారు. ఇందులో అదితి రావ్ హైదరి - నివేదా థామస్ లు హీరోయిన్స్ గా నటించారు. నాని కెరీర్లో 25వ చిత్రంగా రూపొందిన 'వి' ఇటీవలే ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి సినీ విశ్లేషకుల నుంచి నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ లో రిలీజ్ అవడం లేదని బాధ పడిన ఫ్యాన్స్ సైతం.. అమెజాన్ ప్రైమ్ లో మూవీ చూసిన తర్వాత థియేటర్స్ లో విడుదల చేయకపోవడమే మంచిదైందని కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా నాని కెరీర్లో సిల్వర్ జూబ్లీగా వచ్చిన 'V' చిత్రాన్ని ఇప్పుడు టెలివిజన్ స్క్రీన్ పైకి తీసుకొస్తున్నారు. జెమినీ టీవీ చానెల్ లో త్వరలోనే ప్రసారం చేయనున్నట్లు ప్రకటనలు ఇస్తున్నారు. థియేటర్ కంటే ముందుగానే నాని నటించిన 'వి' సినిమాను టీవీలో వేస్తున్నామని జెమిని వారు యాడ్స్ లో పేర్కొంటున్నారు. దీంతో ఈ సినిమాని మళ్ళీ థియేట్రికల్ రిలీజ్ చేసే ఆలోచన కూడా ఉందా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆల్రెడీ ఓటీటీలోనే ప్లాప్ సినిమా అనిపించుకున్న 'వి' చిత్రాన్ని మళ్ళీ థియేటర్ లో విడుదల చేసే సాహసం మేకర్స్ చేయకపోవచ్చని.. ఒకవేళ చేసినా జనాలు ఈ చిత్రాన్ని పట్టించుకోక పోవచ్చని అంటున్నారు. మరి జెమినీ టీవీ వారు ఏ ఉద్దేశ్యంతో అలాంటి ప్రకటనలు ఇస్తున్నారో అని కామెంట్స్ చేస్తున్నారు.