Begin typing your search above and press return to search.

V రిజ‌ల్ట్ విసిరిన పంచ్ ఆ రేంజులో ప‌డిందా?

By:  Tupaki Desk   |   25 Sep 2020 12:30 AM GMT
V రిజ‌ల్ట్ విసిరిన పంచ్ ఆ రేంజులో ప‌డిందా?
X
ఓటీటీలో రిలీజైన తొలి పెద్ద సినిమాగా వి రికార్డుల‌కెక్కింది. ఈ సినిమాకి 32కోట్ల మేర డీల్ ని కుదుర్చుకుని దిల్ రాజు లాభ‌ప‌డ్డార‌ని అయితే అమెజాన్ ప్రైమ్ కి మాత్రం అది వ‌ర్క‌వుట్ కాలేదని ప్ర‌చార‌మైంది. వి కి నెగెటివ్ టాక్ రావ‌డంతో ఆ మేర‌కు పంచ్ ప‌డిపోయింది.

అయితే వి రిజ‌ల్ట్ ప్ర‌భావం ఇత‌ర సినిమాల‌పై దారుణంగా ప‌డింద‌న్న విశ్లేష‌ణ సాగుతోంది. ప్ర‌స్తుతం కోన వెంక‌ట్ నిశ్శ‌బ్ధం చిత్రాన్ని ప్రైమ్ లో రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. రూ.24కోట్ల‌కు డీల్ కుదిరింద‌ని చెబుతున్నారు. అయితే 30 కోట్లు పైగా కోన ఈ సినిమాకి బ‌డ్జెట్ పెడితే ఆరు కోట్ల న‌ష్టం త‌ప్ప‌ద‌న్న విశ్లేషణ సాగుతోంది. వి కి ముందు పెద్ద రేట్ చెప్పినా.. ఇప్పుడిలా న‌ష్టానికి రిలీజ్ చేయాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది. ఒక‌వేళ మూవీ రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకుంటే మాత్రం శాటిలైట్.. డబ్బింగ్ స‌హా వేరే రైట్స్ ద్వారా ఆ న‌ష్టాన్ని భ‌ర్తీ చేసే వీలుంటుంది.

మునుముందు రిలీజ్ కి రానున్న చిత్రాల‌పై ఈ ప్ర‌భావం ప‌డ‌నుంది. రైట్స్ కోసం పెద్ద మొత్తాల్ని అమెజాన్ కానీ ఇత‌ర డిజిట‌ల్ కంపెనీలు కానీ వెద‌జ‌ల్లే ప్ర‌య‌త్నం చేయ‌వ‌ని విశ్లేషిస్తున్నారు. అక్టోబ‌ర్ 2న నిశ్శ‌బ్ధం - ఒరేయ్ బుజ్జిగా.. అక్టోబ‌ర్ 23న క‌ల‌ర్ ఫోటో చిత్రాలు రిలీజ‌వుతున్నాయి. సోలో బ్రతుకే సో బెటర్- గుడ్ లక్ సఖి- మిస్ ఇండియా చిత్రాలు ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.