Begin typing your search above and press return to search.

విషయం లేక రేటింగ్స్ మీద ఏడుపా ?

By:  Tupaki Desk   |   16 Dec 2018 10:14 AM GMT
విషయం లేక రేటింగ్స్ మీద ఏడుపా ?
X
ఎవరెన్ని చెప్పినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కంటెంట్ ఉన్న సినిమాలను ఆడకుండా ఆపడం ఎవరి తరం కాదు. అధిక శాతం ప్రేక్షకులు మెచ్చినప్పుడు థియేటర్ల సంఖ్య చచ్చినట్టు పెంచాల్సి వచ్చిన సందర్భాలను చాలా చూసాం. గతంలో బిచ్చగాడు మొదటిరోజు కేవలం 50 లోపు సెంటర్లలో విడుదలైతే పది రోజులు దాటకుండనే ఆ సంఖ్య 200 దాటడం ట్రేడ్ ని సైతం నివ్వెరపోయేలా చేసింది. అది కంటెంట్ కున్న దమ్ము. రివ్యూలు రేటింగులు ఇతోధికంగా మంచి సినిమాకు సహాయపడతాయి తేడా ఉన్న వాటిని ఎండగడతాయి. అంతే తప్ప బాక్స్ ఆఫీస్ ని శాశించే స్థాయి ఉండదు.

ఆ సత్యం మర్చిపోయాడు ఒడియన్ దర్శకుడు శ్రీకుమార్ మీనన్. మోహన్ లాల్ హీరోగా మలయాళంలో అత్యంత భారీ భారీ బడ్జెట్ తో వంద కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో మొన్న శుక్రవారం వచ్చిన ఒడియన్ కి ఒరిజినల్ వెర్షన్ తో సహా తెలుగు తమిళ్ భాషల్లో కూడా పూర్తి నెగటివ్ టాక్ వచ్చేసింది. రేటింగ్స్ రెండు దాటించడానికి కూడా రైటర్స్ ఇష్టపడలేదు. ఈ అంశాన్ని టార్గెట్ చేసుకుని విచిత్రంగా మాట్లాడుతున్నాడు శ్రీకుమార్. ప్రేక్షకులు తన సినిమా పట్ల సంతోషంగా ఉన్నారని చెప్పాడు.

కేవలం ఒక పెయిడ్ బ్యాచ్ సినిమాను చంపేందుకు వసూళ్లు ప్రభావితం అయ్యేలా నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారని ఆన్ లైన్ వేదికగా మార్చుకున్న ఈ సైబర్ టీమ్ వల్లే డ్యామేజ్ అంటూ ఏదేదో చెప్పుకొచ్చాడు. మోహన్ లాల్ లాంటి కంప్లీట్ యాక్టర్ నే మెప్పించేలా చూపించలేక ఓడిపోయినప్పుడు ఇలా ఇంకొకరి మీద నిందలు వేయడం ఏంటని అభిమానులే ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఒడియన్ అన్ని భాషల్లో ఊహించని షాక్ ఇచ్చింది. తెలుగులో రెండో రోజే ఖాళీ హాళ్లు దర్శనమిచ్చాయి. మన్యం పులితో కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకున్న లాల్ ను ఒడియన్ మాత్రం మొదటి రోజే ఓడించేసింది.