Begin typing your search above and press return to search.
‘బాహుబలి’ టెన్షన్ కొంచెం తగ్గింది
By: Tupaki Desk | 15 July 2015 12:22 PM GMTబాహుబలి తమిళంలోనూ విడుదలవుతోందన్నపుడు కోలీవుడ్ వాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. నిజానికి బాహుబలితో పాటు ఒకటి రెండు స్ట్రెయిట్ సినిమాల్ని వదలడానికి కూడా సన్నాహాలు జరిగాయి. ఐతే జ్నానవేల్ రాజా తన పలుకుబడి ఉపయోగించి.. పోటీ లేకుండా చూసుకున్నారు. ఐతే బాహుబలి హంగామా ఎంతున్నా.. తర్వాతి వారానికి తగ్గిపోతుందన్న ఉద్దేశంలో ధనుష్, శింబు తమ సినిమాల్ని షెడ్యూల్ చేసి పెట్టుకున్నారు. ధనుష్ సినిమా మారి, శింబు సినిమా వాలు 17న విడుదలవ్వాల్సి ఉంది. ఐతే ఫస్ట్ వీకెండ్‌లో బాహుబలి ప్రభంజనం చూశాక వారిలో కంగారు పుట్టిన మాట వాస్తవం.
అదే సమయంలో మారి, వాలు సినిమాల కోసం థియేటర్లు ఖాళీ చేయడానికి కూడా ఎగ్జిబిటర్లు సందేహించారు. తమిళ నాట థియేటర్ల సంఖ్య చాలా తక్కువ. మనలాగా కాదు. ధనుష్, శింబులిద్దరూ పెద్ద స్టార్లే కాబట్టి థియేటర్లు అడ్జస్ట్ చేయడం చాలా కష్టం. బాహుబలికి చెక్ పెట్టాల్సిందే. ఐతే అనూహ్యంగా శింబు సినిమా వాలు వాయిదా పడిపోవడం బాహుబలికి కలిసొచ్చేలా ఉంది. వాలు విడుదల కాకుండా బాహుబలితో ఇంకో వారం దున్నుకోవచ్చు. ఐతే బాహుబలి జోరు చూస్తుంటే కొంచెం ధనుష్‌కు కూడా లోలోన కంగారుగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాకు హిట్ టాక్ వస్తే ఓకే కానీ.. తేడా వస్తే మాత్రం తొలిసారి ఓ తెలుగు డబ్బింగ్ సినిమా దెబ్బకు తమిళ స్టార్ హీరో మూవీ దెబ్బయిపోవడం ఖాయం.