Begin typing your search above and press return to search.
WAR బ్యూటీ బెల్ బాటమ్ పరేషానులే
By: Tupaki Desk | 18 Nov 2022 12:42 AM GMTబాలీవుడ్ లో ఇటీవలి కాలంలో అత్యంత బిజీ నాయికల జాబితాలో వాణీ కపూర్ అగ్రతాంబూలం అందుకుంటోంది. బ్యాక్ టు బ్యాక్ మూడు భారీ పాన్ ఇండియా చిత్రాల్లో వాణీ నటిస్తోంది. వాణి కపూర్ బాలీవుడ్ లో సుదీర్ఘ కాలం కొనసాగుతన్న ప్రతిభావని. ఆమె 1988లో జన్మించింది. 2013లో రొమాంటిక్ కామెడీ చిత్రం 'శుద్ధ్ దేశీ రొమాన్స్'లో తన సినీ రంగ ప్రవేశం చేసింది. ఉత్తమ అరంగేట్ర నాయికగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది.
ఆ తర్వాత బేఫిక్రే చిత్రంలో తనదైన నటనతో మెప్పించింది. తెలుగులో ఆహా కళ్యాణం లో నటించినా కానీ సినిమా డిజాస్టరైంది. తెలుగుకు ఈ భామ సూట్ కాలేదని విమర్శల పాలైంది. ఆ తర్వాత యాక్షన్ చిత్రాలైన వార్ - బెల్ బాటమ్ లలో వానీ నటనకు ప్రశంసలు అందుకుంది. రొమాంటిక్ కామెడీ చిత్రం 'చండీగఢ్ కరే ఆషికి'లో లింగమార్పిడి మహిళగా అద్భుత నటనతో మరోసారి నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంలో వాణీ పోషించిన పాత్ర అన్ని వర్గాల దృష్టిని ఆకర్షించింది. అలాగే లింగమార్పిడి అమ్మాయి పాత్రను పోషించిన ఏకైక ప్రముఖ బాలీవుడ్ నటిగా రికార్డులకెక్కింది. ఈ చిత్రంలో ఆమె అద్భుతమైన నటనకు ఇండస్ట్రీ వర్గాల నుంచి బోనస్ ప్రశంసలు కురిసాయి.
ఇప్పుడు వాణీ అర్ధవంతమైన అంచనాలతో భారీ సినిమాలకు దర్శకుల మొదటి ఎంపికగా మారింది. దశాబ్ధ కాలం పోరాటం తర్వాత వాణీ ఇటీవల అగ్ర నాయిక హోదాకు చేరుకుంది. వాణి కపూర్ తదుపరి రిలీజ్ లకు రానున్న చిత్రాల ప్రచారానికి కూడా సిద్ధమవుతోంది. తదుపరి బ్యాక్ టు బ్యాక్ మూడు రిలీజ్ లతో దూసుకురానుంది.
వీటిలో ఒకటి దినేష్ విజన్ ప్రాజెక్ట్ ఒకటి. అషిమ్ అహ్లువాలియాతో అలాగే మరొకటి నిఖిల్ అద్వానీ ప్రొడక్షన్స్ తో చేస్తోంది. బ్లాక్ బస్టర్ చిత్రం వార్ తర్వాత వాణీ కెరీర్ పరంగా పీక్ లో ఉంది. హిందీ చిత్రసీమలో ఆమె కెరీర్ కు ఈ చిత్రం పెద్ద మైలురాయిగా నిలిచింది. 'చండీగఢ్ కరే ఆషికి' చిత్రం నటిగా తన రేంజును అమాంతం పెంచింది. ఇటీవల షంషేరాలోను అద్భుతంగా నటించింది.
తదుపరి రిలీజ్ కి రానున్న వాటిలో జానర్ పరంగా బోలెడంత వైవిధ్యం తనకు ప్లస్ కానుంది. విభిన్న పాత్రలలో అద్భుత నట ప్రదర్శనకు ఆస్కారం ఉంది. మూడు సినిమాల్లో మూడు వైవిధ్యమైన ప్రధాన పాత్రలతో వాణీ అదరగొట్టనుంది. ఇప్పటికే ఫిలింమేకర్స్ వాణీ కపూర్ ను అసాధారణమైన అద్భుతమైన నటిగా చూస్తున్నారు. ఈ క్రేజ్ తో ఇతర నాయికలకు ధీటుగా రాణించేందుకు వాణీ ఎత్తుగడలు వేస్తోంది. తదుపరి ఈ బ్యూటీ సౌత్ కి వచ్చేందుకు కూడా ప్రణాళికలు వేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇంతలోనే వాణీ హాట్ ఫోటోషూట్లు అంతర్జాలంలో ఒణుకు పుట్టిస్తున్నాయి. గుబులు రేపే అందాలతో వాణీ గడగడలాడిస్తోంది. తాజాగా వాణీ కపూర్ తనలోని స్టైల్ కంటెంట్ ని మరో కొత్త కోణంలో ఆవిష్కరించింది. ఇంతకుముందే ముంబైలోని మాడాక్ ఆఫీస్ నుండి బయలుదేరుతూ తెల్లటి ట్యాంక్ టాప్ - గ్రీన్ బెల్ బాటమ్ ప్యాంట్ తో మురిపించింది. ఈ డ్రెస్ తో పాటు మ్యాచింగ్ గాగుల్స్ లో మతులు చెడగొట్టింది. ముఖ్యంగా వాణీ బెల్ బాటమ్ ప్యాంటు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ స్మైల్ అయితే ఇక కుర్రకారు కలల్లో ప్రవహిస్తూనే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అంతగా వాణీతో ప్రేమలో పడిపోవడం గ్యారెంటీ.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.