Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: హాటెస్ట్ బాలీవుడ్ బేబ్

By:  Tupaki Desk   |   18 Jun 2019 7:00 AM GMT
ఫోటో స్టొరీ: హాటెస్ట్ బాలీవుడ్ బేబ్
X
హాటు బ్యూటీ వాణి కపూర్ తెలుసు కదా? చాలా ఏళ్ళ క్రితమే నాని సినిమా 'ఆహా కళ్యాణం' లో హీరోయిన్ గా నటించింది. ఇక బాలీవుడ్ లో 'శుద్ద్ దేశి రొమాన్స్'.. 'బేఫిక్రే' లాంటి సినిమాలలో నటించి బోల్డ్ భామ ట్యాగ్ ను సాధించింది. 'బేఫిక్రే' హిట్ కాలేదు కానీ రణవీర్ సింగ్ తో పోటీపడి రచ్చరచ్చగా నటించి.. ఘాటు లిప్పులాకులిచ్చి కుర్రకారును వెర్రెత్తించింది. ఈ భామ సోషల్ మీడియాలో యమా యాక్టివ్. గ్లామర్ ట్రీట్ ఇవ్వాలని మైండ్ లో ఫిక్స్ అయిందంటే బ్లైండ్ గా ఆ పని చేసేస్తుంది.

తాజాగా అదేపని చేసింది. తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు వాణి ఇచ్చిన క్యాప్షన్ "తుఫాన్ లాంటి మనసు.. ప్రశాంతమైన ప్రేమ". ఆమె క్యాప్షన్ ను ఎలా అర్థం చేసుకోవాలనిపిస్తే అలా అర్థం చేసుకోండి. ఇక ఈ ఫోటోకు వాణి ఇచ్చిన పోజును వర్ణించడానికి భాష సరిపోదు. అసలు ఖజురహో శిల్పాలలో ఈ పోజు ఉదో లేదో. ఒకవేళ లేకపోతే కళాభిమానులందరూ విరాళాలు ఇచ్చి మరీ ఒక కత్తి లాంటి శిల్పం తయారు చేయించి ఖజురహో లో పెట్టించాలి. ట్రంపు సారు ఇచ్చిన 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' స్లోగన్ లాగా.. మనం 'మేక్ ఖజురహో గ్రేట్ అగైన్' అనే స్లోగన్ ఇవ్వాలి.

అసలే పిడికెడంత నడుము.. ఆ నడుమును హైలైట్ చేసేలా వెనక్కు తిరిగి కూర్చుని.. జుట్టుకు జడ వేసుకుంటున్నట్టుగా పోజివ్వడంతో నేపథ్యంలో ఉన్న ప్రకృతి కూడా పరవశించేలా ఉంది. ఈ ఫోటోకు సూపర్ కామెంట్లు వచ్చాయి. 'బెస్ట్ కర్వ్స్ ఇన్ బాలీవుడ్".. "ఏ చీజ్ బడీ హై మస్త్ మస్త్".. "బాలీవుడ్ కి షెహజాదీ".. "హాటెస్ట్ బాలీవుడ్ బేబ్" అన్నారు. కానీ ఒక నెటిజన్ మాత్రం బికిని కలర్ కాంబినేషన్ బాగాలేదన్నాడు. నిజమే కదా.. పైనేమో బ్లూ.. కిందేమో వైట్! ఈ సంగతేమో కానీ ప్రస్తుతం వాణి 'ఫైటర్స్'.. 'షంషేరా' అనే చిత్రాలల్లో నటిస్తోంది.