Begin typing your search above and press return to search.

బెల్ట్ మ‌ర్చిపోయి తాడు చుట్టుకున్న పాప‌

By:  Tupaki Desk   |   22 Sep 2019 1:30 AM GMT
బెల్ట్ మ‌ర్చిపోయి తాడు చుట్టుకున్న పాప‌
X
`ఆహా క‌ళ్యాణం` సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యమైంది ముంబై టాప్ మోడ‌ల్ వాణీ క‌పూర్. తొలి ప్ర‌య‌త్నం తీవ్రంగా నిరాశ‌ప‌ర‌చ‌డంతో మ‌ళ్లీ టాలీవుడ్ లో క‌నిపించ‌లేదు. అయినా య‌శ్ రాజ్ ఫిలింస్ సంస్థ వ‌రుస‌గా అవ‌కాశాలిస్తోంది. ఈ బ్యాన‌ర్ లో తెర‌కెక్కిన భారీ యాక్ష‌న్ చిత్రం `వార్` అక్టోబ‌ర్ 2న మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `సైరా-న‌ర‌సింహారెడ్డి`కి పోటీగా బ‌రిలో దిగుతున్న సంగ‌తి తెలిసిందే. హృతిక్- టైగ‌ర్ ష్రాఫ్ క‌థానాయ‌కులుగా న‌టించిన ఈ చిత్రంలో హృతిక్ తో రొమాన్స్ చేసే అంద‌గ‌త్తెగా వాణీ క‌నిపించ‌బోతోంది.

ఇప్ప‌టికే గుంగురో పాటలో వాణీ పోల్ డ్యాన్స్ లు.. ఆక్రోబెటిక్స్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ఎంతో బ‌రువైన చ‌క్రం పై ఎంతో బ్యాలెన్స్ చేస్తూ గిర‌గిరా తిరిగేయ‌డం.. అలాగే స్విమ్మింగ్ పూల్ లో ఓ పోల్ సాయంతో అలా అలా చ‌క్క‌ర్లు కొడుతూ చాలానే శ్ర‌మించింది.

ఇక నిరంత‌రం ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో వార్ చిత్రాన్ని ప్ర‌మోట్ చేస్తూనే త‌న‌ను తాను ప్ర‌మోట్ చేసుకునేందుకు ఫోటోషూట్ల‌తో అభిమానుల‌కు ట్రీటిస్తోంది. తాజాగా వాణీ షేర్ చేసిన స్టన్నింగ్ ఫోటో యువ‌త‌రం వాట్సాప్ ల‌లో జోరుగా వైర‌ల్ అవుతోంది. వైట్ టాప్.. బాట‌మ్ లో డార్క్ బ్లూ జీన్స్ తో అద‌ర‌గొట్టింది. అయితే ఆ జీన్స్ కి బెల్ట్ పెట్టుకోవ‌డం మ‌రిచి ఇలా తాడు చుట్టుకుందేమిటో!