Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : టాప్ లేపుతున్న అమ్మడి అందాలు..!

By:  Tupaki Desk   |   17 Jan 2023 1:30 AM GMT
ఫోటో స్టోరీ : టాప్ లేపుతున్న అమ్మడి అందాలు..!
X
బాలీవుడ్ లో అన్ లక్కీ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది కచ్చితంగా వాణి కపూర్ అని చెప్పొచ్చు. ఎప్పుడో 2013లో వచ్చిన శుధ్ దేశి రొమాన్స్ తో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు దశాబ్ద కాలం అవుతున్నా సరే ఇప్పటికీ కెరీర్ స్ట్రాంగ్ చేసుకోలేదు. 10 ఏళ్లలో కేవలం ఏడు సినిమాలనే చేసిన వాణి కపూర్ నిజంగానే ఛాన్స్ లు రాలేదా.. వచ్చినా చేయలేదా అన్న డౌట్ కూడా ఉంది. అయితే సినిమాల కన్నా అమ్మడు మోడలింగ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది.

దాదాపు వాణిజ్య ప్రకటనలతోనే అమ్మడు కెరీర్ కొనసాగిస్తుంది. అయినా కూడా సిల్వర్ స్క్రీన్ పై మెరవాలన్న అక్కడ స్టార్ క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తుంది. అందరిది ఒకదారి అయితే తనది మరో దారి అన్నట్టుగా సినిమాల కన్నా వాణి కపూర్ ఫోటో షూట్స్ మీద స్పెషల్ ఫోకస్ చేసింది. అమ్మడి ఫోటో షూట్ చూస్తే ఎవరైనా సూపర్ అనాల్సిందే. గ్లామర్ షోలో ఏమాత్రం అడ్డు అదుపు లేని అందాల ప్రదర్శనతో అలరిస్తుంది వాణి కపూర్.

తనని ఫాలో అవుతున్న ఫ్యాన్స్ ని ఏమాత్రం డిజప్పాయింట్ కాకుండా అదరగొడుతుంది వాణి కపూర్. ఇక లేటెస్ట్ గా రెడ్ కలర్ డ్రెస్ లో ఎద అందాల ప్రదర్శనతో బాబోయ్ సోషల్ మీడియాని హీటెక్కించేస్తుంది.. పరదాల చాటున పరువాలతో భామ ఈ ఫోటోని చూసిన వాణి ఫాలోవర్స్ నువ్విలా రెచ్చిపోతే మాలాంటి వాళ్ల పరిస్థితి ఏంటమ్మా అంటూ చిలిపి కామెంట్స్ చేస్తున్నారు.

పర్ఫెక్ట్ బాడీ షేపులతో స్టార్ మెటీరియల్ అయిన వాణి ఎందుకు క్లిక్ అవలేదో తెలియదు కానీ అమ్మడికి సరైన పాత్ర పడి ఉంటే మాత్రం టాప్ లేచిపోయే రేంజ్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకునేదని చెప్పొచ్చు. తెలుగులో ఆహా కళ్యాణం సినిమా చేసినా ఇక్కడ కూడా వర్క్ అవుట్ కాలేదు. సినిమాల కన్నా సోషల్ మీడియా ఫోటో షూట్స్ మీదే ఎక్కువ ఫోకస్ పెడుతుంది వాణి కపూర్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.