Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: అన్నీ గ్లామర్ మంటలే

By:  Tupaki Desk   |   17 Nov 2019 5:30 PM GMT
ఫోటో స్టోరీ: అన్నీ గ్లామర్ మంటలే
X
భామలందు హాటు భామలు వేరు. హాటు భామల రాగం వేరు.. వారి తాళం వేరు. అత్తెసరు భామలు 2-2 లో ఉంటే హాటు భామలు 2-8 లో ఉంటారు. ఇక ఈ సాదాసీదా భామలు అక్కడికి ఎలా వెళ్తారు చెప్పండి? ఎవరూ వారిని అక్కడికి తీసుకుపోలేరు! ఈ కింగు పురాణం ఇంతటితో ఆపేస్తే కొందరికి బాడీలోనే సహజంగా హాట్ నెస్ ఉంటుంది. దాంతో సోషల్ మీడియాలో తరచుగా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుంటారు. అలాంటి భామల్లో వాణి కపూర్ ఒకరు.

వాణి చేసిన సినిమాలు తక్కువే కానీ ఆ తక్కువ సినిమాల్లోనే తన బోల్డ్ యాక్టింగ్ ను పూర్తిగా బయటకు తీసి జనాలను మెప్పించింది. అప్పుడెప్పుడో 'శుద్ద్ దేశి రొమాన్స్' లోనే లిప్ లాకులతో రెచ్చిపోయి బోల్డ్ యాక్టింగ్ కు డెఫినిషన్ ఇచ్చింది. ఇక 'బేఫిక్రే' లో వాణి - రణవీర్ గిన్నిస్ రికార్డులో ఎక్కించగలిగినన్ని సార్లు లాకులు చేసుకున్నారు. అయితే ఆ సినిమా బోల్తా కొట్టింది. ఈమధ్య ఈ భామ 'వార్' సినిమాలో కూడా బికినీలతో బోల్డ్ యాక్టింగ్ తో రెచ్చిపోయింది. సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ భామ సోషల్ మీడియాను తన బోల్డ్ ఫోటో షూట్లతో మంటలు పెట్టడం ఒక్కరోజు కూడా ఆపడం లేదు.

బికినీలతో బీచ్ లో నడవడం.. కాల్విన్ క్లెయిన్ బ్రాండ్ కనిపించేలా ప్యాంట్ జిప్ తీయడం.. హాలీవుడ్ నటీమణుల తరహాలో ఘాటుపోజులివ్వడం ఈ భామకు సర్వసాధారణంగా మారిపోయింది. ఈ ఫోటోలతో వాణికి రానురాను ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది. ఇలానే కొనసాగితే ఈ భామ హాలీవుడ్ హీరోయిన్ గా మారడం ఖాయమే. వాణి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రస్తుతం 'షంషేరా' అనే సినిమాలో నటిస్తోంది.