Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ హిట్ కొట్టిన జోష్ లో `వార్` బ్యూటీ వాణీ

By:  Tupaki Desk   |   20 Aug 2021 10:47 AM GMT
మ‌ళ్లీ హిట్ కొట్టిన జోష్ లో `వార్` బ్యూటీ వాణీ
X
అక్షయ్ కుమార్ నటించిన బెల్ బాటమ్ ఈ గురువారం విడుదలైంది. ``ఇది అక్కీ మార్క్ సినిమా.. లారా ద‌త్తా న‌ట‌న‌.. వాణీ గ్లామ‌ర్ ఆకట్టుకుంది అంటూ ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. స్పై-యాక్షన్ థ్రిల్లర్ లో అక్ష‌య్ అద్భుతంగా న‌టించార‌ని.. లారా దత్తా -వాణి కపూర్ పాత్ర‌లు మెరిసాయ‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి. తొలి నుంచి ఈ సినిమా త‌న‌కు చాలా స్పెష‌ల్ అంటూ వాణీ కపూర్ మురిసిపోతోంది. అందుకు త‌గ్గ‌ట్టే త‌న కెరీర్ లో మ‌రో విజ‌యాన్ని ఖాతాలో వేసుకుంది.

బెల్ బాటమ్ నిజఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం. ఈ కథ 1980 లలోని కొంద‌రు అజేయులైన‌ మరపురాని హీరోల గురించిన క‌థ‌తో తెర‌కెక్కింది. ఈ సినిమా మొదట్లో 2021 రిపబ్లిక్ డేలో విడుదల కావాల్సి ఉండ‌గా కోవిడ్ అంతా మార్చేసింది. సెకండ్ వేవ్ వ‌ల్ల‌ పెరుగుతున్న COVID-19 కేసుల కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. బెల్ బాట‌మ్ షూటింగ్ స్కాట్లాండ్ - లండన్ .. భారతదేశంలో జరిగింది. ఈ సినిమా 3డిలో ఆగస్టు 19న థియేటర్లలో విడుదలైంది. సినిమా ప్రీమియర్ అనంత‌రం నెటిజ‌నులు పాజిటివ్ రివ్యూలను సోషల్ మీడియాలో అందించారు. బెల్ బాటమ్ గురించి క‌రణ్ జోహార్ స‌హా ప‌లువురు పాజిటివ్ రివ్యూలను ఇచ్చారు. ఇక స‌మీక్ష‌కుల్లో వాణీ గ్లామ‌ర్ షో గురించి వాడి వేడిగా చ‌ర్చించారు.

అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో ఒక రహస్య ఏజెంట్ గా నటించాడు. అతను బెల్‌బాట్టమ్ అనే కోడ్ నేమ్ తో వెళ్తాడు. అతను విమానం హైజాక్ అయిన తర్వాత రహస్యంగా రక్షించే ఆపరేషన్ కోసం నియ‌మితుడైన అధికారి. హైజాక్ చేయబడిన విమానంలో చిక్కుకున్న భారతీయ పౌరులను రక్షించడానికి ఒక రహస్య ఆపరేషన్ ని అత‌డు ప్లాన్ చేస్తాడు. వాణీ కపూర్ అతని భార్యగా నటించ‌గా దుబాయ్ లో హూమా ఖురేషి అతని బృంద సభ్యులలో ఒకరిగా క‌నిపిస్తారు.

బాలీవుడ్ సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ సినిమాకి 4/5 రేటింగ్ ఇచ్చారు. వ‌న్ వ‌ర్డ్ స‌మీక్ష‌లో ... #బెల్ బాటమ్ గ్రిప్పింగ్ మూవీ. #BellBottom అనేది #పెద్ద స్క్రీన్ అనుభవం కోసం ఉద్దేశించిన ఒక ఎంటర్ టైనర్ ... సూపర్ పెర్ఫార్మెన్స్ తో లోడ్ చేసిన మూవీ. సెకండ్ హాఫ్ లో అక్షయ్ కుమార్ మరోసారి మెరిశాడు. #రంజిత్ తివారీ దర్శకత్వం అత్యున్నత స్థాయిలో ఉంది అని తెలిపారు.

ఒక అభిమాని ట్వీట్ చేస్తూ..ఈ రోజు నేను బెల్ బాటమ్ మూవీని చూశాను. మనసును కదిలించే సినిమా యార్.. అక్షయ్ కుమార్ సర్ నటన లారా మేడ‌మ్ అద్భుతమైన పరిణ‌తి ఆక‌ట్టుకున్నాయి. ఆమె నిజంగా ఇందిర లాగా కనిపిస్తారు. వాణీ గ్లామ‌ర్ ఆక‌ట్టుకుంది అని తెలిపారు. గాంధీజీ #అక్షయ్ కుమార్ #బెల్ బాటమ్ #వాణీ కపూర్ #లారా దత్తా.. అంటూ హ్యాష్ ట్యాగుల్ని వైర‌ల్ చేశారు. మరొక నెటిజ‌న్ ఇలా వ్రాశారు #BellBottom చూడటం పూర్తయింది: పంచ్ డైలాగ్ లు.., అద్భుతమైన సినిమాటోగ్రఫీ .. కథపై ఖచ్చితమైన పట్టు... అక్షయ్ కుమార్ తనను ఖిలాడీ అని ఎందుకు పిలిచారో నిరూపించాడు. ఇది చాలా గొప్ప సినిమా అంటూ ప్ర‌శంసించారు.

ఈ విజ‌యంతో వాణీ క్రేజ్ మ‌రింత‌గా స్కైని ట‌చ్ చేయ‌డం ఖాయం. ఇప్ప‌టికే ఈ బ్యూటీ వ‌రుస‌గా య‌ష్ రాజ్ బ్యాన‌ర్ లో సినిమాల‌కు సంత‌కాలు చేసింది. మ‌రోవైపు క్రేజీగా ప‌లు వాణిజ్య ప్ర‌క‌ట‌నల కోసం భారీ డీల్స్ కుదుర్చుకుంది. సోష‌ల్ మీడియాల్లో నూ అసాధార‌ణంగా ఫాలోయింగ్ పెంచుకుని ఎర్న్ చేస్తోంది.