Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: చెవిలో పువ్వు పెట్ట‌క‌లా వాణీ..!

By:  Tupaki Desk   |   4 Nov 2021 11:30 PM GMT
ఫోటో స్టోరి: చెవిలో పువ్వు పెట్ట‌క‌లా వాణీ..!
X
ఆహాక‌ళ్యాణం బ్యూటీ వాణీ క‌పూర్ సోష‌ల్ మీడియాల్లో ఎంత స్పీడ్ గా ఉంటుందో ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఈ బ్యూటీ ఇటీవ‌ల వ‌రుసగా హాట్ ఫోటోషూట్ల‌తో ఫ్యాన్స్ ని షేక్ చేస్తోంది. తాజాగా షేర్ చేసిన ఫోటోషూట్ లో వాణీ అల్ల‌రి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చిలిపిగా అల్ల‌రిగా ఏదో ఒక‌టి చేసేయ‌కు వాణీ.. అంటూ ఈ ఫోటోల‌కు అల్ల‌రిగా కామెంట్లు పెడుతున్నారు అభిమానులు. అలా చేతిలో ఐదు రేక‌ల పుష్పాన్ని తీసుకుని వాణీ చాలా వేషాలు వేస్తోంది. కాన్సెప్ట్ ఫోటోషూట్ అభిమానుల్లోకి వైర‌ల్ గా దూసుకెళ్లింది.

బ్లూ ఫ్లీస్ స్పోర్ట్స్ బ్రా- ష్రగ్ జీన్స్ లో వాణీ రూపం మ్యాజిక్ చేస్తోంద‌నే చెప్పాలి. ఈ శీతాకాలానికి స‌రిపోయే స‌రైన లుక్ ఇది. తన సోషల్ మీడియా హ్యాండిల్ లో వాణి ఇటీవల స్పోర్టీ-స్నగ్-స్టైల్ హైబ్రిడ్ స్టైల్ లో శీతాకాలాన్ని స్వాగతిస్తున్న ఫోటోలతో మెరిపించింది. ఇవి ఉన్ని బట్టతో తయారు చేసినవి. నీలిరంగు బేస్ స్పోర్ట్స్ బ్రా హైలైట్ గా క‌నిపిస్తోంది. ముదురు నీలం మరియు ఆకుపచ్చ రంగుల ప్రింట్ లతో ఈ డిజైన‌ర్ డ్రెస్ ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది. వాణీ బ్రాలెట్ టాప్ ప్లంజింగ్ నెక్ లైన్ మ‌రింత ఆక‌ర్ష‌ణ పెంచింది. ఆ కిల్లర్ వెస్ట్ లైన్ ఎలివేష‌న్ ఈ లుక్ లో మ‌రో హైలైట్. వీటిలో ఒక భంగిమ‌లో అలా చెవి లో తెల్లటి పువ్వుతో డ్రీమ్ గాళ్ నే త‌ల‌పిస్తోంది. కెమెరా ముందు హొయ‌లు పోతూ అద్భుతమైన భంగిమలతో వాణీ మిరుమిట్లు గొలిపింది.

కోవిడ్-19 లాక్ డౌన్ అనంత‌రం వాణీ వ‌రుస షూటింగుల‌తో బిజీ అయ్యింది. ఇటీవలే అమ్మ‌డు న‌టించిన `బెల్ బాట‌మ్` రిలీజ్ అయింది. కానీ సినిమా ఆశించ‌నంత‌గా రాణించ‌లేదు. ప్ర‌స్తుతం క‌ర‌ణ్ మ‌ల్హోత్రా తెర‌కెక్కిస్తోన్న `షామ్ శ్రీ` అనే భారీ బ‌డ్జెట్ పిరియాడిక్ చిత్రంలోనూ న‌టిస్తోంది. ఇందులో ర‌ణ‌బీర్ క‌పూర్..సంజయ్ ద‌త్ హీరోల‌గా న‌టిస్తున్నారు. అలాగే అభిషేక్ కపూర్ దర్శ‌క‌త్వంలో `చండీఘ‌ర్ క‌రే ఆశీకిల్` లో న‌టిస్తోంది. ఇందులో ఆయుష్మాన్ ఖురానా హీరోగా న‌టిస్తున్నాడు.