Begin typing your search above and press return to search.
రెడ్ హాట్ ఫ్రాక్ లో సన్నజాజి అందం
By: Tupaki Desk | 12 Dec 2021 11:30 AM GMTవాణీ కపూర్.. పరిచయం అవసరం లేదు. తెలుగులో ఆహాకల్యాణం చిత్రంలో నటించింది. నాని సరసన ఈ బ్యూటీ నటించినా సరైన హిట్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమైంది. అక్కడ యష్ రాజ్ బ్యానర్ వాణీని ఆస్థాన నాయికను చేసి వరుస చిత్రాల్ని చేస్తోంది. ఇంతకుముందు యష్ రాజ్ బ్యానర్ లోనే వార్ చిత్రంలో హృతిక్ సరసన నటించిన వాణీ కపూర్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. బాలీవుడ్ లో ఆరంగేట్రమే `శుద్ దేశీ రొమాన్స్` చిత్రంతో విజయం అందుకుని `బేఫికరే`..చిత్రంతో ప్రేక్షకులకు మరింత చేరువైంది. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీ నటిగా మారింది.
వాణీకపూర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్లతో వాణీ ఇన్ స్టా వేదికగా టచ్ లో ఉంది. తాజాగా వాణీ రెడ్ హాట్ డిజైనర్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. ఈ ఫోటో లో వాణీ కపూర్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. చూపరుల మతులు చెడగొడుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.
ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే అమ్మడు నటించిన `బెల్ బాటమ్` రిలీజ్ అయింది. అక్షయ్ సరసన నటించిన ఈ సినిమా కరోనా క్రైసిస్ లో రావడంతో ఆశించనంతగా రాణించలేదు. ప్రస్తుతం కరణ్ మల్హోత్రా తెరకెక్కిస్తోన్న `షామ్ శ్రీ` అనే భారీ బడ్జెట్ పిరియాడిక్ చిత్రంలోనూ నటిస్తోంది. ఇందులో రణబీర్ కపూర్..సంజయ్ దత్ హీరోలగా నటిస్తున్నారు. అలాగే అభిషేక్ కపూర్ దర్శకత్వంలో `చండీఘర్ కరే ఆశీకిల్` లో నటిస్తోంది. ఇందులో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నాడు. ప్రభాస్ సలార్ లోనూ వాణీ విలన్ గ్యాంగ్ లో కనిపిస్తుందని టాక్ వచ్చింది. కానీ దానికి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు.