Begin typing your search above and press return to search.

వార్ బ్యూటీ క్రిస్మ‌స్ ట్రీట్ ఆ లెవ‌ల్లో

By:  Tupaki Desk   |   25 Dec 2021 4:30 AM GMT
వార్ బ్యూటీ క్రిస్మ‌స్ ట్రీట్ ఆ లెవ‌ల్లో
X
వార్ బ్యూటీ వాణీ వేడెక్కిస్తోంది. అస‌లే క్రిస్మ‌స్ ముందు చ‌లి గిలి అంటూ యూత్ ఒక‌టే షేక్ అయిపోతుంటే బాడీలోకి హీట్ ని పంప్ చేసే మ్యాజిక‌ల్ లుక్ తో ప్ర‌త్య‌క్ష‌మైంది.

వాణీ క‌పూర్ హాటెస్ట్ లుక్ ఇది. బ్లాక్ లెద‌ర్ ఫ్యాంట్ .. రెడ్ ఊల్ కోట్ కాంబినేష‌న్ లో వాణీ ఎంతో హాట్ గా క‌నిపిస్తోంది. బ్లాక్ ఇన్న‌ర్ తో అందాల ఎలివేష‌న్ లోనూ వాణీ ఎక్క‌డా త‌గ్గ‌లేదు.

కాలంతో పాటే మార్పు .. కొన్ని ప‌రాజ‌యాల త‌ర్వాత కూడా వార్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రంతో కంబ్యాక్ అయిన వాణీ ఇటీవ‌ల వ‌రుస‌గా పాన్ ఇండియా చిత్రాల‌తో బిజీగా ఉంది. డిసెంబ‌ర్ 25 క్రిస్మ‌స్ ని పుర‌స్క‌రించుకుని ప్ర‌త్యేక ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు వచ్చింది. ఇదిగో నా క్రిస్మ‌స్ ప్రిప‌రేష‌న్స్ ఇలా ఉన్నాయి.. హౌ అబౌట్ యు? అంటూ షాపింగ్ కి ఆహ్వానిస్తోంది వాణీ. పాపుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ వెబ్ సైట్ల‌కు ప్ర‌మోట్ చేస్తూ బాగానే వెన‌కేసుకొస్తోంది. సినిమాల ఆదాయంతో పాటు ప్ర‌క‌ట‌నల ఆదాయం బాగానే లాగేస్తోంది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్ వైర‌ల్ గా మారింది.

వాణీ కపూర్ సినిమాల విష‌యానికి వ‌స్తే ఇటీవలే అమ్మ‌డు న‌టించిన `బెల్ బాట‌మ్` రిలీజ్ అయింది. కానీ సినిమా ఆశించ‌నంత‌గా రాణించ‌లేదు. ప్ర‌స్తుతం క‌ర‌ణ్ మ‌ల్హోత్రా తెర‌కెక్కిస్తోన్న `షామ్ శ్రీ` అనే భారీ బ‌డ్జెట్ పిరియాడిక్ చిత్రంలోనూ న‌టిస్తోంది. ఇందులో ర‌ణ‌బీర్ క‌పూర్..సంజయ్ ద‌త్ హీరోల‌గా న‌టిస్తున్నారు. అలాగే అభిషేక్ కపూర్ దర్శ‌క‌త్వంలో `చండీఘ‌ర్ క‌రే ఆశీకిల్` లో న‌టిస్తోంది. ఇందులో ఆయుష్మాన్ ఖురానా హీరోగా న‌టిస్తున్నాడు.