Begin typing your search above and press return to search.

స‌న్న‌జాజి సోయ‌గం వాణీ హాటెస్ట్ లుక్

By:  Tupaki Desk   |   13 May 2022 2:30 AM GMT
స‌న్న‌జాజి సోయ‌గం వాణీ హాటెస్ట్ లుక్
X
వాణీ క‌పూర్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఆహా క‌ళ్యాణం చిత్రంతో తెలుగు ఆడియెన్ కి ప‌రిచ‌య‌మైన ఈ భామ వార్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రంలో న‌టించింది. ఇక సినిమాల‌తో కంటే టాప్ మోడ‌ల్ గా ఈ అమ్మ‌డికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. వాణీ క‌పూర్ ప్ర‌స్తుతం బాలీవుడ్ లో ప‌లు పాన్ ఇండియా చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది.

ఇక ఇప్పుడున్న నాయిక‌ల్లో టాప్ రేంజులో స్టైలిష్ లుక్ తో మెరిసిపోయే ఈ బ్యూటీ సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తుంటుంది. తాజాగా వాణీ లుక్ పూర్తిగా మారిపోయింది. స‌న్న‌జాజి సోయ‌గాన్ని త‌ల‌పిస్తోంద‌ని చెప్పాలి. అదిరిపోయే ఒంపులు తిరిగిన‌ శరీరాకృతిని ప్రదర్శిస్తున్న ఈ అందం మిరుమిట్లు గొలుపుతోంది.తాజా ఫోటోగ్రాప్ లో వాణి కపూర్ ఓపెన్ టాప్ లో ఆకర్షణీయమైన రూపాన్ని ప్రదర్శిస్తోంది. వాణి ఈ లుక్ లో హాటెస్ట్ సొంపుల్ని డిస్‌ప్లే చేసింది. వాణి సన్నజాజి తీగ రూపం కుర్ర‌కారును హ‌త్తుకుంటోంది.త‌న‌ని తాను ఆవిష్క‌రించుకోవ‌డంలో కంటికి ఆహ్లాదకరమైన రీతిలో చూపించే విషయంలో ఈ భామ‌కు ఎటువంటి సంకోచం లేదు.

ప్ర‌స్తుత సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఇటీవలే అమ్మ‌డు న‌టించిన `బెల్ బాట‌మ్` రిలీజ్ అయింది. అక్ష‌య్ స‌ర‌స‌న న‌టించిన ఈ సినిమా క‌రోనా క్రైసిస్ లో రావ‌డంతో ఆశించ‌నంత‌గా రాణించ‌లేదు. ప్ర‌స్తుతం క‌ర‌ణ్ మ‌ల్హోత్రా తెర‌కెక్కిస్తోన్న `షామ్ శ్రీ` అనే భారీ బ‌డ్జెట్ పిరియాడిక్ చిత్రంలోనూ న‌టిస్తోంది. ఇందులో ర‌ణ‌బీర్ క‌పూర్..సంజయ్ ద‌త్ హీరోల‌గా న‌టిస్తున్నారు. అలాగే అభిషేక్ కపూర్ దర్శ‌క‌త్వంలో `చండీఘ‌ర్ క‌రే ఆశీకిల్` లో న‌టిస్తోంది. ఇందులో ఆయుష్మాన్ ఖురానా హీరోగా న‌టిస్తున్నాడు. ప్ర‌భాస్ స‌లార్ లోనూ వాణీ విల‌న్ గ్యాంగ్ లో క‌నిపిస్తుంద‌ని టాక్ వ‌చ్చింది. కానీ దానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంటుంది.