Begin typing your search above and press return to search.

వాణీ ఏంటీ వేడి? మ‌తిపోక త‌ప్ప‌దు మ‌రి!

By:  Tupaki Desk   |   7 March 2022 9:36 AM GMT
వాణీ ఏంటీ వేడి? మ‌తిపోక త‌ప్ప‌దు మ‌రి!
X
బాలీవుడ్ బ్యూటీ వాణీక‌పూర్ ఎప్ప‌టిక‌ప్పుడు ఇన్ స్టాని హీటెక్కించ‌డంలో త‌న‌దైన మార్క్ వేస్తుంది. టెంప్టింగ్ ఫోటోల‌తో మంట‌లు రేపుతూ మ‌తికి తెస్తుంది ముప్పు. తాజాగా మ‌రో కొత్త ఫోటోతో వాణీ లో వేడిని ఆవిష్క‌రించింది. చీరందంలో బ్యూటీ త‌ళుక్కున మెరిసింది. అంతేనా? త‌న‌దైన మార్క్ ఎలివేష‌న్ ఇచ్చి మ‌తిపోగొడుతోంది. న‌ల్ల చీర‌.. మ్యాచింగ్ బ్లౌజ్ తో బ్యూటీ ఆహ్లాద‌క‌రంగా ఎలివేట్ అవుతూనే మ‌రోవైపు ఎద అందాల షోతోనూ ఆక‌ట్టుకుంటుంది.

ఇక ఫోటోలో వాణీ కిల్ల‌ర్ లుక్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచింది. నుదిటిన ర‌వ్వంత బ్లాక్ స్టిక‌ర్..చెవుల‌కు పెట్టిన దిద్దులు వాణీ అందాన్ని మ‌రింత హైలైట్ చేస్తున్నాయి. స్టాండింగ్ లో రైట్ యాంగిల్ కి 45 డిగ్రీస్ ఫేస్ ట‌ర్న్ చేసి బ్యూటీ కెమెరాకి ఫోజులిచ్చింది.

ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. వాణీ అనుచ‌ర గ‌ణం అభిమానానాకి ఎల్ల‌లు లేవు. గ‌త ఫోటోల‌తో పోల్చుకుంటే వాణీక‌పూర్ ఈ సారి గ్లామ‌ర్ డోస్ త‌గ్గించిన‌ట్లు క‌నిపిస్తుంది. చీరందాన్ని...ముఖంలో చామ్ ని మాత్ర‌మే హైలైట్ చేసింది.

వాణీ క‌పూర్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలే. నేచుర‌ల్ స్టార్ నాని స‌ర‌స‌న `ఆహా క‌ళ్యాణం` తో టాలీవుడ్ లో లాంచ్ అయింది. కానీ ఆ సినిమా అమ్మ‌డికి అంత‌గా గుర్తింపు తీసుకురాలేదు. అటుపై బాలీవుడ్ లో ప్ర‌య‌త్నాలు చేసి అక్క‌డ స‌క్సెస్ అయింది.

బాలీవుడ్ లో `శుద్ దేశీ రొమాన్స్` చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన వాణి క‌పూర్ అటుపై `బేఫ్ క్రే`..`వార్` లాంటి చిత్రాల‌తో ఉత్త‌రాది ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువైంది. ప్ర‌స్తుతం అక్క‌డ బిజీ న‌టిగా కొన‌సాగుతోంది. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వ‌ర‌కూ అంద‌రితోనూ ఛాన్సులందుకుంటోంది.

ఇటీవలే అమ్మ‌డు న‌టించిన `చండీఘ‌ర్ క‌రే ఆశీకిల్` రిలీజ్ అయింది. అభిషేక్ క‌పూర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించి సినిమా యావ‌రేజ్ గా ఆడింది. ప్ర‌స్తుతం క‌ర‌ణ్ మ‌ల్హోత్రా తెర‌కెక్కిస్తోన్న `షాంమ్ శ్రీ` అనే భారీ బ‌డ్జెట్ పిరియాడిక్ చిత్రంలోనూ న‌టిస్తోంది. ఇందులో ర‌ణ‌బీర్ క‌పూర్..సంజయ్ ద‌త్ హీరోల‌గా న‌టిస్తున్నారు.