Begin typing your search above and press return to search.
అగ్గి రాజేయడమెలానో వార్ బ్యూటీని అడగాలి
By: Tupaki Desk | 23 Jun 2021 11:51 AM GMT`వార్` చిత్రంలో హృతిక్ సరసన నటించింది వాణీ కపూర్. యష్ రాజ్ బ్యానర్ లో శుధ్ దేశీ రొమాన్స్ తర్వాత మళ్లీ తనకు కెరీర్ పరంగా పెద్ద బూస్ట్ ఇచ్చిన చిత్రమిది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వాణీ కెరీర్ పరంగా బిజీబిజీగా ఉంది.
మరోవైపు ఫ్యాషన్ పోకడల్ని అనుసరించడంలోనూ వాణీ ప్రత్యేకత గురించి యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. వాణీ పబ్లిక్ అప్పియరెన్స్ కోసం ఎంపిక చేసుకునే దుస్తుల్లో ఎంతో విలక్షణత కనిపిస్తుందని యువతరం కాంప్లిమెంట్ ఇస్తోంది. ఉత్తరాది సమా దక్షిణాదినా యూత్ తనని విపరీతంగా అనుసరిస్తోందని ఇంతకుముందు ఒక ప్రముఖ కార్పొరెట్ బ్రాండ్ ప్రతినిధులు వెల్లడించారు.
సిటీకల్చర్ సహా ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ వాణీకి విపరీతమైన ఫాలోయింగ్ ఉందని ఓ సర్వే తేల్చి చెప్పింది. ఇకపోతే వాణీ రకరకాల డిజైనర్ దుస్తుల్లో ఫోజులిచ్చినవి ఓ చోట వెబ్ మాధ్యమాల్లో మాషప్ తో ప్రచుర్యం పొందుతున్నాయి. ఇండస్ట్రీలో సూపర్ మోడల్ గా రాణిస్తూనే కథానాయికగానూ వాణీ తనదైన మార్క్ వేస్తోంది. బోల్డ్ లుక్ అయినా ట్రెడిషనల్ లుక్ అయినా వాణీ తనకంటూ ఒక ప్రత్యేకతను ఆపాదించుకుని అందరినీ ఆకట్టుకుంటోంది. వందల కోట్ల టర్నోవర్ తో రన్ అవుతున్న భారీ కార్పొరెట్ బ్రాండ్లకు వాణీ ప్రచారం చేస్తోంది. ఏడాది ప్రచారం కోసం భారీ కాంట్రాక్టులు కుదుర్చుకుంటూ కోట్లలో ఆర్జిస్తోందని తెలిసింది.
ప్రస్తుతం ముంబైలో లాక్ డౌన్ సడలించడంతో సెట్స్ పై ఉన్న బెల్ బాటమ్ -చండీగ కరే ఆషికి చిత్రీకరణలు పూర్తి చేసేందుకు వాణీ రెడీ అవుతోంది.